బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన బాలయ్య టాప్ 10 సినిమాలివే?

Star Hero Balakrishna Top 10 Movies Details Here

స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అయితే కొన్ని సినిమాలు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డులను క్రియేట్ చేశాయి.

 Star Hero Balakrishna Top 10 Movies Details Here-TeluguStop.com

బాలయ్యకు కోపం ఎక్కువని లౌక్యం తక్కువని చాలామంది అంటారు.కానీ గర్వం లేని వ్యక్తి వ్యక్తిగా బాలయ్య పేరు తెచ్చుకున్నారు.ఆయన మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అని ఆయన సన్నిహితులు చెబుతారు.

100కు పైగా సినిమాలలో బాలకృష్ణ హీరోగా నటించారు.బాలయ్య కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మంగమ్మ గారి మనవడు ఒకటి.మరో విధంగా చెప్పాలంటే ఈ సినిమా బాలకృష్ణను స్టార్ హీరోగా నిలబెట్టింది.హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమా హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య నాన్నమ్మ పాత్రలో భానుమతి నటించారు.బాలయ్యకు జోడీగా సుహాసిని నటించగా కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

 Star Hero Balakrishna Top 10 Movies Details Here-బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన బాలయ్య టాప్ 10 సినిమాలివే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

13 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.బాలయ్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ముద్దుల మావయ్య ఒకటి.తమిళ సినిమాకు ఈ సినిమా రీమేక్ కాగా ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు.

అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ లేడీస్ లో బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది.

Telugu Balakrishna, Balakrishnatop, Bobbili Simham, Legend, Muddula Mamayya, Simha, Narinari, Tollywood, Top-Movie

బాలయ్య కెరీర్ లో విభిన్నమైన కథతో తెరకెక్కి సక్సెస్ సాధించిన సినిమా నారీ నారీ నడుమ మురారి అని చెప్పవచ్చు.ఫైట్లు లేకుండా తెరకెక్కిన ఈ సినిమా కథ, బాలయ్య నటన వల్ల హిట్టైంది.చాలామంది రచయితలు ఈ సినిమా కొరకు పని చేశారు.ఈ సినిమాలోని ఆన్ని పాటలు హిట్టయ్యాయి.45 కేంద్రాల్లో ఈ మూవీ 100 రోజులు ఆడింది.బాలయ్య కెరీర్ లోని హిట్లలో లారీ డ్రైవర్ సినిమా కూడా ఒకటి.

Telugu Balakrishna, Balakrishnatop, Bobbili Simham, Legend, Muddula Mamayya, Simha, Narinari, Tollywood, Top-Movie

ఈ సినిమాకు మొదట ఫ్లాప్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాలయ్య నటించిన రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమా చాలా స్పెషల్ అని చెప్పాలి.నవ్యత ఉన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య తన నటనతో విశ్వరూపం చూపించారు.

ఈ సినిమా ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయింది.బాలయ్య కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో బొబ్బిలి సింహం ఒకటి.

ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అల్లు అరవింద్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేశారు.

బి.గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటించిన సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్టైంది.

ఈ సినిమాలో సమరసింహారెడ్డిగా, అబ్బులు పాత్రలో బాలయ్య నటించి మెప్పించారు.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.తొలి ఆట నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.6 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మూవీ తెరకెక్కింది.

Telugu Balakrishna, Balakrishnatop, Bobbili Simham, Legend, Muddula Mamayya, Simha, Narinari, Tollywood, Top-Movie

బి.గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య నటించిన నరసింహ నాయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది.చిన్నికృష్ణ ఈ సినిమాకు కథ అందించారు.

సమరసింహారెడ్డి తర్వాత బి.గోపాల్ ను ట్రాక్ లో నిలబెట్టిన సినిమాగా నరసింహ నాయుడు నిలిచింది.8 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో బాలయ్య నటనకు నంది అవార్డు దక్కింది.105 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది.బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఫుల్ రన్ లో అఖండ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి ఈ జాబితాలో చేరుతుందేమో చూడాల్సి ఉంది.

#Samarasimha #NariNari #Simha #Simha #Bobbili Simham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube