మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం.. దర్శకుడెవరంటే..?

స్టార్ హీరో బాలకృష్ణ అభిమానులు సినిమాల్లోకి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటులుగా ప్రూవ్ చేసుకున్నారు.

 Star Hero Balakrishna Son Mokshagna Debut Entry Movie Fixed, Nandamuri Family, P-TeluguStop.com

మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీలోకి త్వరగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.చాలా సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి వార్తలు వస్తుండగా ఈ ఏడాదే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, నాగార్జున కొడుకులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటులుగా ప్రూవ్ చేసుకుని విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ఈ ఏడాది జూన్ 10వ తేదీన మోక్షజ్ఞ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Balakrishna, Mokshagna, Mokshagna Debut, Fixed, Nandamuri, Puri Jagannadh

గతంలో కూడా పూరీ జగన్నాథ్ మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు రాగా ఆ వార్తలు నిజం కాలేదు.ఈసారైనా ఆ వార్తలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.మోక్షజ్ఞ త్వరలోనే ఎంట్రీ ఇస్తారని బాలకృష్ణ కూడా గతంలో కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాలకృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తాడని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

సింహా, లెజెండ్ సినిమాల తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ ఏడాది సమ్మర్ లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube