ఆ విషయంలో బాలకృష్ణ ఒంటరి వారయ్యడా.. ఆ ఫ్యాన్స్ సాయం తీసుకుంటారా?

టాలీవుడ్ హీరోలలో నందమూరి బాలకృష్ణ రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.బాలయ్య తన సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా ఒకే విధంగా ఉంటారని జయాపజయాలు దైవాధీనాలు అని భావిస్తారని ఇండస్ట్రీలో చాలామంది అభిప్రాయపడతారు.

 Star Hero Balakrishna Single In That Matter Details Here Goes Viral , Shruti Haa-TeluguStop.com

బాలయ్య వీరసింహారెడ్డి మూవీ నుంచి వస్తున్న ప్రతి అప్ డేట్ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతోందే తప్ప తగ్గించడం లేదు.

అయితే సంక్రాంతికి రిలీజవుతున్న ఇతర సినిమాల వీడియోలకు వస్తున్న స్థాయిలో వ్యూస్, లైక్స్ వీరసింహారెడ్డి సినిమా కంటెంట్ కు రావడం లేదు.

ఈ విషయంలో బాలయ్య అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు.వాల్తేరు వీరయ్య సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు రవితేజ సపోర్ట్ కూడా తోడు కావడం ఒకింత ప్లస్ అవుతోంది.

వీరసింహారెడ్డి మూవీ విషయంలో ఇతర హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ విషయంలో మాత్రం అలా జరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య ప్రస్తుత పరిస్థితుల్లో తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ తీసుకుంటే మంచిదని కొంతమంది సూచిస్తున్నారు.

బాలయ్య తారక్ కలిసి కనిపిస్తే నందమూరి హీరోల అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ విషయాలు బాలయ్య దృష్టికి వస్తే బాలయ్య ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య కెరీర్ కు వీరసింహారెడ్డి మూవీ అటు కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంలో కీలకం కానుంది.జనవరి ఫస్ట్ వీక్ లో ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ షోలో వీరసింహారెడ్డి టీమ్ సందడి చేయనుంది.శృతి హాసన్, గోపీచంద్ మలినేని ఈ షోలో సందడి చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్లకు మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి బాలయ్య సైతం ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube