ఆ రీజన్ వల్లే టీడీపీ పగ్గాలు చేపట్టలేదు.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్?

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో ప్రసారమవుతున్న టాక్ షో తొలి ఎపిసోడ్ నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.తొలి ఎపిసోడ్ కు మోహన్ బాబు గెస్ట్ గా హాజరు కాగా అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను మోహన్ బాబు ఈ షో ద్వారా పంచుకున్నారు.

 Star Hero Balakrishna Shocking Comments About Tdp Party, Balakrishna  , Unstopbl-TeluguStop.com

పటాలం పాండు అనే సినిమాలో నటించడంతో ఆ సినిమా రిలీజైన తర్వాత భార్య నిర్మల తనతో వారం రోజులు మాట్లాడలేదని మోహన్ బాబు అన్నారు.

ఒకానొక సమయంలో తమ బ్యానర్ లో నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయని ఆ సమయంలో భూములను అమ్మి డబ్బులను చెల్లించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత తాను నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ సాధించడంతో ఇండస్ట్రీలో నిలబడగలిగానని మోహన్ బాబు కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని చెప్పగా తన సినిమాలు ఎవరు చూస్తారని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని సీనియర్ ఎన్టీఆర్ సూచించారని మోహన్ బాబు అన్నారు.

Telugu Balakrishna, Chandrababu, Mohan Bbau, Sr Ntr, Tdp, Unstopble-Movie

సీనియర్ ఎన్టీఆర్ అన్నయ్యను కాదనుకుని తాను చంద్రబాబు మాట విని వచ్చానని అయితే తాను అలా చేయడం తప్పని రజినీకాంత్ చెప్పగా రజినీకాంత్ తో కలిసి సీనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లానని మోహన్ బాబు అన్నారు.సీనియర్ ఎన్టీఆర్ “నువ్వు కూడానా” అని అనడంతో తనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదని నోట మాట రాలేదని మోహన్ బాబు తెలిపారు.ఆ తర్వాత మోహన్ బాబు ఎన్టీఆర్ తర్వాత ఎందుకు టీడీపీ పగ్గాలు చేపట్టలేదని బాలయ్యను ప్రశ్నించారు.

Telugu Balakrishna, Chandrababu, Mohan Bbau, Sr Ntr, Tdp, Unstopble-Movie

ఆ సమయంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వారసత్వ రాజకీయాలు నడుస్తుండగా వాటికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని బాలయ్య చెప్పుకొచ్చారు.పార్టీ ప్రజల కొరకు నిలబడాలని వంశపారంపర్య రాజకీయాలు చేయకూడదని భావించి తెలుగుదేశం పగ్గాలు చేపట్టలేదని బాలయ్య కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube