ఆ షోకు బాలయ్య రెమ్యునరేషన్ ఇదే.. చంద్రబాబు ఎపిసోడ్ ఎప్పుడంటే?

స్టార్ హీరో బాలకృష్ణ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ మొత్తం డిమాండ్ చేయరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అన్ స్టాపబుల్ సీజన్1 కు బాలకృష్ణ కేవలం 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.ఆ సమయంలో ఈ షో ఏ రేంజ్ లో హిట్ అవుతుందనే అవగాహన లేకపోవడం కూడా బాలయ్య తక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడానికి కారణమని చెప్పవచ్చు.

 Star Hero Balakrishna Remuneration For Unstoppable Show Details Here , Unstoppab-TeluguStop.com

అయితే ఈ షో వల్ల ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఊహించని రేంజ్ లో పెరిగాయి.

చాలామంది బాలయ్య అభిమానులు ఈ షో కోసమే ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను తీసుకున్నారు.

అయితే బాలయ్య వల్ల అన్ స్టాపబుల్ షో అంచనాలకు మించి సక్సెస్ సాధించి సీజన్2 దిశగా అడుగులు పడ్డాయి.అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కోసం బాలయ్య 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని రెమ్యునరేషన్ ఫైనల్ కాకపోయినా ఆరు కోట్ల రూపాయల రేంజ్ లో ఇవ్వడానికి ఆహా నిర్వాహకులు సుముఖంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ షోకు గెస్ట్ గా హాజరు కానున్నారు.దీపావళికి అటూఇటుగా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలుస్తోంది.

ఈ షోకు పవన్ కళ్యాణ్ ను కూడా రప్పించే ప్రయత్నాలు జరుగుతుండగా ఆయన ఈ షోపై ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.ఆహా సబ్ స్క్రిప్షన్లు పెరిగే రేంజ్ ఉన్న సెలబ్రిటీలను ఈ షోకు ఆహ్వానిస్తున్నారు.

ఆహా ఓటీటీ సక్సెస్ కావడానికి బాలయ్య తన వంతు కష్టపడుతున్నారు.ఆహా ఓటీటీ ప్రస్తుతం చిన్న సినిమాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే క్రేజ్ ఉన్న సినిమాలను, హిట్టయ్యే సినిమాలను కొనుగోలు చేయడం ఈ ఓటీటీకి ప్లస్ అవుతోంది.ఇతర ఓటీటీలతో పోల్చి చూస్తే ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఫీజు కూడా తక్కువనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube