రూ.కోటి పెంచితే చాలని చెప్పిన బాలయ్య.. కొత్త సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే?

సాధారణంగా ఒక సినిమా సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ స్టార్ హీరోలు కళ్లు చెదిరే స్థాయిలో పారితోషికం పెంచుతున్నారు.కొంతమంది స్టార్ హీరోలు తాము తీసుకునే పారితోషికంతో పోల్చి చూస్తే సక్సెస్ వచ్చిన తర్వాత రెట్టింపు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు.

 Star Hero Balakrishna Remuneration For New Movie Details Here Balakrishna,   Rem-TeluguStop.com

అయితే స్టార్ హీరో బాలకృష్ణ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులకు పోవడం లేదని సమాచారం అందుతోంది.

అఖండ సినిమాకు బాలయ్యకు 11 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కింది.

అయితే బాలయ్య కొత్త సినిమా కోసం 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్, జీఎస్టీ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.అఖండ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే కోటి రూపాయల రెమ్యునరేషన్ పెంచితే చాలని బాలయ్య చెప్పారని సమాచారం అందుతోంది.

బాలయ్య మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఇంత మంచి మనస్సు ఉండటం వల్లే బాలయ్య సినిమాలకు నష్టాలు వచ్చినా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అఖండ సినిమాతో 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించిన బాలయ్య బుల్లితెరపై కూడా ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.బుల్లితెరపై అఖండకు భారీగా రేటింగ్ వచ్చింది.

Telugu Crore Rupess, Akhanda, Balakrishna, Nbk, Sruthi Hassan, Tolllywood-Movie

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.రాబోయే రోజుల్లో బాలయ్య మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుని వెండితెరపై సంచలన విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాకు అన్నగారు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ టైటిల్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube