ఆహా టాక్ షో కోసం హీరో బాలకృష్ణ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Star Hero Balakrishna Remuneration For Aha Unstoppable With Nbk Show Details Here

యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు.ఈ స్టార్ హీరోరెమ్యునరేషన్ తో పోలిస్తే సీనియర్ స్టార్ హీరోలు తక్కువమొత్తం పారితోషికంగా తీసుకుంటున్నారు.

 Star Hero Balakrishna Remuneration For Aha Unstoppable With Nbk Show Details Here-TeluguStop.com

ప్రస్తుతం స్టార్ హీరో బాలకృష్ణ ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

వెండితెరకే పరిమితమై సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చిన బాలకృష్ణ సైతం మారుతున్న కాలానికి అనుగుణంగా టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు.చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి మెప్పించారు.

 Star Hero Balakrishna Remuneration For Aha Unstoppable With Nbk Show Details Here-ఆహా టాక్ షో కోసం హీరో బాలకృష్ణ రెమ్యునరేషన్ అన్ని కోట్లా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆహా టాక్ షో కొరకు బాలకృష్ణ ఏకంగా 5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సమాచారం.ఒక ఎపిసోడ్ కు 40 లక్షల రూపాయల చొప్పున బాలయ్యకు రెమ్యునరేషన్ అందుతోందని తెలుస్తోంది.

Telugu Aha Unstoppable, Allu Aravind, Balakrishna, Artist, Nbk Show, Tollywood, Unstoppable Nbk-Movie

ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉన్నా బాలకృష్ణ మాత్రం తక్కువ పారితోషికానికి అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు.నవంబర్ నెల 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలోషో ప్రసారం అవుతుండటం గమనార్హం.మొత్తం 12 ఎపిసోడ్లు ప్రసారమవుతాయని ఆహా ఓటీటీ నిర్వాహకుల నుంచి సమాచారం అందుతోంది.

అ!, జాంబీ రెడ్డి సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ వర్మటాక్ షోకు దర్శకత్వం వహించనున్నారు.ఈ షోకు హాజరయ్యే స్టార్స్ కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.బాలయ్య అభిమానులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాక్ షో ద్వారా బాలకృష్ణ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.ఈ షోకు హాజరయ్యే గెస్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

#Allu Aravind #Aha Unstoppable #Nbk #Unstoppable Nbk #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube