స్టార్ హీరో బాలయ్య నిజస్వరూపం ఇదే.. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో బాలకృష్ణ అన్ని రకాల పాత్రలను పోషించే టాలెంట్ ఉన్న నటుడు కావడంతో పాటు బాలయ్యను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Star Hero Balakrishna Real Behavior Details Here Goes Viral, Hero Balakrishna, S-TeluguStop.com

బాలకృష్ణ స్టార్ హీరో అయినప్పటికీ ఆ భావనను కలిగి ఉండరని సీనియర్ ఎన్టీఆర్ కూడా సింపుల్ గానే ఉండేవారని ఆయన కామెంట్లు చేశారు.

పబ్లిక్ ఫంక్షన్ లో ఆడియన్స్ నుంచి స్టేజ్ పైకి వెళ్లడం కల్చర్ అని పబ్లిక్ లో ఉండటం సీనియర్ ఎన్టీఆర్ కు అలవాటైందని బాలకృష్ణ కూడా దానిని కొనసాగిస్తున్నారని భరద్వాజ్ చెప్పుకొచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్ ప్రతిరోజూ ఉదయం అరగంటపాటు అభిమానులతో మాట్లాడేవారని ఆయన తెలిపారు.బాలయ్య పబ్లిక్ తోనే ఉంటాడని మరీ ఇబ్బంది పెడితే మాత్రం బాలయ్య అక్కడే రియాక్ట్ అవుతాడని భరద్వాజ్ పేర్కొన్నారు.

Telugu Balakrishna, Senior Ntr-Movie

బాలకృష్ణ మీమ్స్ గురించి కానీ రెమ్యునరేషన్ గురించి కానీ పెద్దగా పట్టించుకోరని భరద్వాజ్ కామెంట్లు చేశారు.నిర్మాత తక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నా బాలకృష్ణ సినిమా చేసే విషయంలో వెనుకడుగు వేయరని భరద్వాజ్ చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ విషయంలో పట్టింపుతో ఉండేవారని భరద్వాజ్ వెల్లడించారు.డైరెక్టర్ ఏది చెబితే బాలయ్య అది చేస్తాడని ఆయన చెప్పుకొచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్ బయటి వాళ్ల సినిమాలలో వేలు పెట్టేవారు కాదని భరద్వాజ్ తెలిపారు.పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడగొట్టే సీన్ ను బాలయ్య వద్దని చెప్పారని కానీ డైరెక్టర్ సూచనల మేరకు చేసేశారని ఆయన అన్నారు.

బాలయ్యకు లోపల ఒకటి బయట ఒకటి ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య రూమ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో బయట ఫోన్ మాట్లాడే సమయంలో కూడా అదే విధంగా మాట్లాడతాడని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube