ఒకే తరహా కథలతో తెరకెక్కి ఫ్లాపైన బాలకృష్ణ సినిమాలు ఏంటో తెలుసా?

స్టార్ హీరో బాలయ్య నటించిన సినిమాలలో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు తక్కువగా ఉన్నాయి.బాలయ్య సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ లేదంటే ఫ్లాప్ అవుతాయని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.

 Star Hero Balakrishna Flop Movies List Details Here Goes Viral , Balakrishna, Ba-TeluguStop.com

అయితే ఒకే తరహా కథలతో తెరకెక్కిన మూడు సినిమాలు బాలయ్య కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచాయి.బాలకృష్ణ హీరోగా స్వర్ణ సుబ్బారావు డైరెక్షన్ లో తెరకెక్కిన విజయేంద్ర వర్మ 2004 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన విడుదలైంది.

ఈ సినిమాలో బాలకృష్ణ గతం మరిచిపోయిన వ్యక్తిగా ఫస్ట్ హాఫ్ లో కనిపించారు.అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

బాలకృష్ణ నటించిన సినిమాలలో మరో సినిమా అయిన లయన్ లో కూడా బాలయ్య గతం మరిచిపోయిన వ్యక్తి పాత్రలో కనిపించారు.అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఫ్లాప్ గా నిలిచింది.

ఆ తర్వాత బాలకృష్ణ రూలర్ అనే సినిమాలో కూడా బాలయ్య గతం మరిచిపోయిన వ్యక్తిగా కనిపించారు.

Telugu Balakrishna, Flop, Ruler, Story Line-Movie

ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.గతం మరిచిపోయిన పాత్రలు బాలయ్యకు అచ్చిరాలేదు.ఈ సినిమాలలో ఉన్న మరో కామన్ పాయింట్ ఏంటంటే విజయేంద్ర వర్మ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా కనిపించిన బాలయ్య లయన్ లో సీబీఐ ఆఫీసర్ గా రూలర్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.

Telugu Balakrishna, Flop, Ruler, Story Line-Movie

ఒకే తరహా కథలతో తెరకెక్కి ఫ్లాపైన బాలకృష్ణ సినిమాలైన ఈ సినిమాలు బాలయ్య అభిమానులను సైతం ఏ మాత్రం ఆకట్టుకోలేదు.సినిమాసినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండగా కథల ఎంపికలో బాలయ్య జాగ్రత్త వహిస్తే బాలయ్య తర్వాత సినిమాలు కూడా అఖండ సినిమాను మించి సక్సెస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube