జబర్దస్త్ షోకు జడ్జిగా బాలకృష్ణ.. షాకవుతున్న నందమూరి అభిమానులు?

Star Hero Balakrishna Comments About Jabardasth Show

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో సంవత్సరాలు గడుస్తున్నా మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం.ఇతర ఛానెళ్లలో కూడా కామెడీ షోలు ప్రసారమవుతున్నా ఆ షోలు జబర్దస్త్ కు గట్టి పోటీ ఇవ్వడంలో ఫెయిల్ కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో విఫలవుతున్నాయి.

 Star Hero Balakrishna Comments About Jabardasth Show-TeluguStop.com

తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది.

ఈ ప్రోమోలో రోజా స్టార్ హీరో బాలకృష్ణకు ఫోన్ చేయగా బాలకృష్ణ రోజాతో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Star Hero Balakrishna Comments About Jabardasth Show-జబర్దస్త్ షోకు జడ్జిగా బాలకృష్ణ.. షాకవుతున్న నందమూరి అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనసూయ  రోజాతో ఈరోజు బాలయ్య బాబుగారికి కాల్ చేయాలని చెప్పగా రోజా బాలయ్య బాబు మంచి మూడ్ లో ఉంటే ఓకే లేదంటే అంటూ కామెంట్లు చేస్తారు.ఆ తర్వాత రోజా బాలకృష్ణకు కాల్ చేయగా బాలకృష్ణ రోజాగారు నమస్కారం అని చెబుతాడు.

రోజా బాగున్నారా అని అడగగా బాగున్నానని బాలయ్య సమాధానం ఇస్తాడు.

మీరెలా ఉన్నారని బాలకృష్ణ అడగగా బాగున్నాను సార్ అని రోజా సమాధానం ఇస్తారు.నేను జబర్దస్త్ లో ఉన్నానని రోజా చెప్పడంతో పాటు మీరేం చేస్తున్నారని బాలయ్యను అడగగా అఖండ షూటింగ్ జరుగుతోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దామని భైరవద్వీపం పార్ట్ 2 చేస్తారా లేక బొబ్బిలి సింహం పార్ట్ 2 చేస్తారా అని అడుగుతున్నారని రోజా చెప్పుకొచ్చారు.

రోజా అలా చెప్పగానే బాలకృష్ణ పకపకా నవ్వి మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని చెబుతారు.జబర్దస్త్ కు జడ్జిగా కూడా తాను వస్తానని బాలయ్య పేర్కొన్నారు.రాఘవ, ఆది అందరూ నాకంటే పెద్దవాళ్లని బాలయ్య సరదాగా కామెంట్లు చేశారు.భవిష్యత్తులో బాలయ్య జబర్దస్త్ కు జడ్జిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే బాలకృష్ణ బుల్లితెర షోలపై దృష్టి పెట్టడంతో నందమూరి అభిమానులు షాకవుతున్నారు.

#Bharavadveepam #Nandamuri Fans #Jabardasth Show #Bobilli Simham #Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube