అల్లు అర్జున్ కెరీర్లో దుమ్ము లేపిన 5 సినిమాలివే..?

గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే మిగతా సినిమాలతో పోలిస్తే 5 సినిమాలు అల్లు అర్జున్ కు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ అయ్యి నిర్మాతలకు కూడా భారీగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం.

 Star Hero Allu Arjun Top 5 Movies List-TeluguStop.com

నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Star Hero Allu Arjun Top 5 Movies List-అల్లు అర్జున్ కెరీర్లో దుమ్ము లేపిన 5 సినిమాలివే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న విడుదలైన పుష్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఈ సినిమా బన్నీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు.

అభిమానులు అల్లు అర్జున్ ను ఇప్పటివరకు స్టైలిష్ స్టార్ గా పిలవగా పుష్ప సినిమా నుంచి అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారబోతున్నారు.

Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Racegurram, Top 5 Movies, Trivikram Srinivas-Movie

బన్నీ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా అల వైకుంఠపురములో.త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.2020 సంవత్సరంలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు నెగిటివ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అల్లు అర్జున్ రెండు షేడ్స్ ఉన్న రోల్ లో నటించిన డిజే సినిమా కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు 115 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.
.

Telugu Ala Vaikuntapuramulo, Allu Arjun, Racegurram, Top 5 Movies, Trivikram Srinivas-Movie

త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి కమర్షియల్ గా హిట్ కావడంతో పాటు 90 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.విలువల కోసం ఆస్తిని త్యాగం చేసే పాత్రలో అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన రేసుగుర్రం కమర్షియల్ గా సక్సెస్ కావడంతో పాటు నటుడిగా బన్నీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

#Allu Arjun #Racegurram #Top 5 Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు