స్టార్ హీరో అల్లు అర్జున్ లో ఉన్న గొప్ప గుణం ఇదే.. నటుడి కామెంట్స్ వైరల్!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ కు ప్రేక్షకులు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆర్య2 సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.

 Star Hero Allu Arjun Great Quality Details Here , Allu Arjun, Ajay Ghosh , Pushpa, Sukumar , Tollywood-TeluguStop.com

పుష్ప ది రైజ్ సినిమాతో బన్నీ సుకుమార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.త్వరలో పుష్ప ది రూల్ షూటింగ్ మొదలుకావాల్సి ఉంది.

ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారనే సంగతి తెలిసిందే.

 Star Hero Allu Arjun Great Quality Details Here , Allu Arjun, Ajay Ghosh , Pushpa, Sukumar , Tollywood-స్టార్ హీరో అల్లు అర్జున్ లో ఉన్న గొప్ప గుణం ఇదే.. నటుడి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యాక్టర్ అజయ్ ఘోష్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రంగస్థలం ఒక ఎత్తైతే పుష్ప ది రైజ్ మరో ఎత్తు అని ఆయన చెప్పుకొచ్చారు.సుకుమార్ గారు ఫోన్ చేసి అడిషన్ తీసుకుని రంగస్థలంలో ఎంపిక చేశారని అజయ్ ఘోష్ అన్నారు.

నాకు జనంతో మమేకం కావడం ఇష్టమని ఆయన వెల్లడించారు.నా లైఫ్ లో పుష్ప సినిమా గురించి ఒక పుస్తకం రాయవచ్చని ఆయన తెలిపారు.

Telugu Ajay Ghosh, Allu Arjun, Pushpa, Sukumar, Tollywood-Movie

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడి పుష్ప షూటింగ్ లో పాల్గొన్నానని ఆయన చెప్పుకొచ్చారు.సుకుమార్ గారు అరగంట మాట్లాడి పుష్ప మూవీలో నటించకూడదన్న నా నిర్ణయాన్ని మార్చారని అజయ్ ఘోష్ వెల్లడించారు.బన్నీతో చేయాలంటే మొదట భయం వేసేదని అజయ్ ఘోష్ అన్నారు.బన్నీ నన్ను చూసి తనలో తాను నవ్వుకుంటూ సినిమా చేయనన్నారట కదా అని అన్నారని అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.

మీరు పుష్ప సినిమాలో నటించకపోతే నేను బాగా డిజప్పాయింట్ అయ్యేవాడినని బన్నీ చెప్పారని అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.బన్నీలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే బాగా నటిస్తే మంచి ఆర్టిస్ట్ తో నటిస్తున్నానని చెబుతూ మెచ్చుకుంటారని అజయ్ ఘోష్ వెల్లడించారు.

బన్నీ చాలా గొప్పోడు అని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.సుకుమార్ గారికి నేను బాగా కనెక్ట్ అయ్యానని అజయ్ ఘోష్ అన్నారు.సుకుమార్ ఒక షాట్ కు సమయానికి ఆర్టిస్టులు రాకపోతే రండ్రా రండ్రా అంటూ బాధపడ్డారని అజయ్ ఘోష్ తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube