సంచలన ప్రకటన చేసిన క్రిస్టియానో రొనాల్డో.. ఈ సాఫ్ట్ డ్రింక్ వద్దు.. మంచినీరు తాగండి అంటూ..!?

చాలా మందికి కూల్ డ్రింక్స్ తాగడం అంటే చాలా ఇష్టం.ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

 Star Football Player Critiano Ronaldo Says No To Soft Drinks In Press Conference-TeluguStop.com

అయితే కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా అనేక రకాల సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే ఈ మధ్య చాలా మంది నీళ్ల కంటే ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తున్నారు.

భోజనానికి మధ్యలో కూడా నీళ్లకు బదులుగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నారు.దీంతో వారు లేనిపోని అనారోగ్యాని కొనితెచ్చుకుంటున్నారు.

తాజాగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కీలక అనౌన్స్మెంట్ ఇచ్చాడు.ఓ సాఫ్ట్ డ్రింక్ ను తాగొద్దని తాజాగా తేల్చి చెప్పాడు.

ఇంటర్నేషన్ లెవల్ లో ఫుట్ బాల్ క్రీడాకారుడు ఇలా చెప్పడం వెనక ఓ నిగూడ అర్థమే ఉందండి.ఈ క్రీడాకారుడు యూరో ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్నాడు.

మొదటి మ్యాచ్ లో దీంతో హంగరీతో బుడా పెస్ట్ లో ఆ ఆట నిర్వహించనున్నారు.

ఆట ఆడే ముందు క్రీడాకారులు ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరుగుతుంది.

అలాగే ఈ క్రీడాకారుడు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.ఆ సమయంలో అతని ముందుగా రెండు కూల్ డ్రింక్స్ బాటిళ్లు కనిపించాయి.

వాటిని చూసిన వెంటనే అతడు ఆ బాటిళ్లను తీసి పక్కన పెట్టేశాడు.అక్కడున్న మీడియా వారు అందరూ ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు.

కోచ్ శాంటోస్‌ కూడా రొనాల్డో చేసిన పనికి ఖంగుతిన్నాడు.

Telugu Ronaldosoft, Ronaldo, Sensational, Soft Drinks, Uefaeuropean-Latest News

ఆ క్రీడాకారుడు ఎందుకు అలా చేశాడో ఎవ్వరికీ అర్థం కాలేదు.కొంత సేపటి తర్వాత దాని గురించి ఆ క్రీడాకారుడు చెప్పుకొచ్చాడు.కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉందన్నాడు.

సాఫ్ట్ డ్రింక్‌ కు బ‌దులుగా నీళ్లు తాగండి ఎంతో ఉత్తమమని ఆయన సూచించారు.అక్క‌డే ఉన్న వాట‌ర్ బాటిల్‌ ను తీసుకుని పైకెత్తుతూ ఇది చాలా ఉపయోగకరం అంటూ సమాధానమిచ్చాడు.

దీంతో అతను అలా అనటం పై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube