స్వీటీ కెరీర్ ఎటు పోతుంది.. అద్భుతం జరగాల్సిందేనా..?- Star Directors Donot Care About Anushka Shetty

anushka career where is going something amazing will happen, star directors donot care about anushka shetty, nishabdham movie, anushka shetty, anushka shetty latest movie - Telugu Anushka Career, Anushka Shetty, Anushka Shetty Latest Movie, Donot Care, Nishabdham Movie, Star Directors

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గతేడాది వరకు వరుస అవకాశాలతో బిజీగా ఉంది అనుష్క.అయితే నిశ్శబ్దం సినిమా తరువాత మాత్రం అనుష్క మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 Star Directors Donot Care About Anushka Shetty-TeluguStop.com

ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న అనుష్కకు సీనియర్ స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడం లేదు.అనుష్క కెరీర్ గతంతో పోలిస్తే మాత్రం డల్ అయిందని చెప్పవచ్చు.

గతేడాది అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై నెగిటివ్ టాక్ ను మూట గట్టుకుంది.మరోవైపు అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ తగ్గిందా.? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.అనుష్క కెరీర్ లో అరుంధతి, భాగమతి లాంటి హిట్లు ఉన్నా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాలను అందుకున్నాయి.

 Star Directors Donot Care About Anushka Shetty-స్వీటీ కెరీర్ ఎటు పోతుంది.. అద్భుతం జరగాల్సిందేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు అనుష్క నిశ్శబ్దం ఫ్లాప్ తరువాత సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని అందుకే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.అయితే ఏదైనా అద్భుతం జరిగి స్వీటీ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే మాత్రమే మళ్లీ వరుస అవకాశాలతో సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు సాధించినా ఆ హిట్లు అనుష్క కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

రారా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్ డైరెక్షన్ లో స్వీటీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి.

కానీ అనుష్క ఆ సినిమాను కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.లాక్ డౌన్ తర్వాత అందరు హీరోహీరోయిన్లు షూటింగ్ లతో బిజీ అవుతుంటే అనుష్క మాత్రం షూటింగ్ లకు దూరంగా ఉండటం గమనార్హం.

#Anushka Shetty #AnushkaShetty #Anushka Career #Star Directors #Donot Care

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు