ప్రముఖ దర్శకుడు తేజ బ్యాగ్రౌండ్ ఏమిటో మీకు తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జయం, నువ్వు నేను, చిత్రం, నేనేరాజు నేనేమంత్రి సినిమాల విజయాలతో దర్శకుడిగా తేజ మంచి పేరును సంపాదించుకున్నారు.తేజ అసలు పేరు జాస్తి ధర్మతేజ.

 Star Director Teja Background Details, Cinematographer, Star Director, Teja, Tej-TeluguStop.com

ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా వేర్వేరు రంగాల్లో తేజ రాణించారు.తేజ 1966 సంవత్సరంలో మద్రాస్ లో జన్మించారు.

తేజ తండ్రి పేరు జె.బి.కె చౌదరి.

ఆర్థికంగా స్థిరపడిన కుటుంబంలో తేజ జన్మించారు.

తేజ బాల గురుకుల పాఠశాలలో చదువుకున్నారు.జీవితా రాజశేఖర్, సుచిత్రా చంద్రబోస్ తేజ్కు క్లాస్ మేట్స్ కాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తేజకు సీనియర్ కావడం గమనార్హం.

అయితే వ్యాపారంలో భారీ మొత్తంలో నష్టం రావడంతో తేజ తండ్రి వ్యాపారం దెబ్బతింది.తేజ బాబాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగించడం కొరకు చిన్నాచితకా పనులు చేసేవారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ల దగ్గర పని చేసిన తేజ రామ్ గోపాల వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు ఎక్కువగా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

Telugu Cinematographer, Class Mates, Teja Background, Mahesh Babu, Career, Nizam

చిత్రం సినిమాను కేవలం 30 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించి ఆ సినిమాతో తేజ భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.ఆ తర్వాత తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.కొత్త హీరోలతో తేజ ఎక్కువగా సినిమాలను తెరకెక్కించడం గమనార్హం.

Telugu Cinematographer, Class Mates, Teja Background, Mahesh Babu, Career, Nizam

కొన్నేళ్ల పాటు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా ఆయనకు క్రేజ్ మాత్రం తగ్గలేదు.తేజ చురుకైన వ్యక్తి కావడంతో తక్కువ సమయంలోనే అంతకంతకూ ఎదుగుతూ కెరీర్ లో విజయాలను సొంతం చేసుకున్నారు.మహేష్ బాబుతో తేజ తెరకెక్కించిన నిజం సినిమా సక్సెస్ కాకపోయినా ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.తేజ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube