ఆ రెండూ కొని అమ్మకు ఇచ్చేవాడిని.. దర్శకుడు సుకుమార్ కామెంట్స్ వైరల్!

Star Director Sukumar Comments About His Mother

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.సంక్రాంతి కానుకగా నిన్న మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ మూడు సినిమాలలో బంగార్రాజు సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

 Star Director Sukumar Comments About His Mother-TeluguStop.com

అఖండ, పుష్ప, బంగార్రాజు సినిమాల సక్సెస్ వల్ల తెలుగు రాష్ట్రాల థియేటర్లకు పూర్వ వైభవం వచ్చింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.

పుష్ప ది రైజ్ సక్సెస్ వల్ల సుకుమార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడంతో పాటు దర్శకుడిగా సుకుమార్ మార్కెట్ పెరిగింది.ఈ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు నాన్న తిరుపతి నాయుడు కుటుంబ సభ్యులందరికీ కొత్తబట్టలను కుట్టించేవారని తెలిపారు.

 Star Director Sukumar Comments About His Mother-ఆ రెండూ కొని అమ్మకు ఇచ్చేవాడిని.. దర్శకుడు సుకుమార్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెద్దక్క కుంకుడు పోసి స్నానం చేయించేదని సుకుమార్ కామెంట్లు చేశారు.పండుగ సమయంలో అమ్మ బూరెలు చేసేదని వాటిని ఎంతో ఇష్టంగా తినేవాడినని సుకుమార్ అన్నారు.

గొబ్బెమ్మల కొరకు, ఇంటి ముందు అలకడం కొరకు ఆవు పేడను వాడేవాళ్లమని పేడ కోసం ఆవుల వెనుక తిరిగేవాడినని సుకుమార్ వెల్లడించారు.

అమ్మకు ఖర్జూరా పండ్లు, పకోడి అంటే చాలా ఇష్టమని ఎవరైనా కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో పకోడి, ఖర్జూరా పండ్లు కొనుగోలు చేసి అమ్మకు ఇచ్చేవాడినని సుకుమార్ చెప్పుకొచ్చారు.పండుగ సమయంలో పరికొసలతో దండ చేసేవాళ్లమని సుకుమార్ అన్నారు.

నా సొంతూరు ఏపీలోని మట్టపర్రు అని భార్యది తెలంగాణ అని సుకుమార్ అన్నారు.అమ్మ యాస, భార్య యాస పూర్తిగా వేర్వేరుగా ఉండేవని సుకుమార్ చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో 2012 సంవత్సరం సంక్రాంతి సంతోషాన్ని కలిగించిందని వన్ నేనొక్కడినే కథ ఓకే కావడంతో ఆ సమయంలో సంతోషంగా ఉన్నానని సుకుమార్ కామెంట్లు చేశారు.

star director sukumar comments about his mother details, sukumar, director sukumar, sukumar mother, sankranthi festival, allu arjun, pushpa, father tirupathi naidu, director sukumar family, one nenokkadine - Telugu Allu Arjun, Mother, Sukumar, Tirupathi, Nenokkadine, Pushpa, Sukumar Mother, Trolls

star director sukumar comments about his mother details, sukumar, director sukumar, sukumar mother, sankranthi festival, allu arjun, pushpa, father tirupathi naidu, director sukumar family, one nenokkadine - Telugu Allu Arjun, Mother, Sukumar, Tirupathi, Nenokkadine, Pushpa, Sukumar Mother, Trolls

#Sukumar #Mother #Allu Arjun #Sukumar #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube