సీఎం జగన్ పై సినిమా గురించి వర్మ షాకింగ్ రియాక్షన్.. ఏం జరిగిందంటే?

Star Director Ram Gopal Varma Shocking Reaction Abou Movie With Jagan

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం ఏపీలోని ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించారు.ఆ సమయంలో ఆర్జీవీపై విమర్శలు వ్యక్తమైనా ఆ విమర్శలను ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు.

 Star Director Ram Gopal Varma Shocking Reaction Abou Movie With Jagan-TeluguStop.com

మరోవైపు వర్మ పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్ కు తాను అభిమానినని చెప్పుకొచ్చారు.సీఎం జగన్ ను తన సినిమాల్లో నెగిటివ్ గా చూపించడానికి వర్మ అస్సలు ఇష్టపడరు.

అయితే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వర్మ తప్పుబట్టారు.పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా వర్మ ఫైర్ అయ్యారనే సంగతి తెలిసిందే.

 Star Director Ram Gopal Varma Shocking Reaction Abou Movie With Jagan-సీఎం జగన్ పై సినిమా గురించి వర్మ షాకింగ్ రియాక్షన్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే జగన్ పై మాత్రం వర్మ విమర్శలు చేయలేదు.తాజాగా వర్మ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రోమోలో వర్మ యంగ్ పీపుల్ తో కలిసి పని చేస్తే మనం ఇంకా యంగ్ అని మనకు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

Telugu Ap Poltics, Ap Ticket Rates, Cm Jagan, Jagan, Heart Rk, Raghurama, Ram Gopal Varma, Tollywood-Movie

వయస్సు పెరిగే కొద్దీ తనకు జ్ఞానం పెరుగుతోందని వర్మ కామెంట్లు చేశారు.బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు బార్ లో జ్ఞానోదయం అయిందని వర్మ వెల్లడించారు.నాలా ఎవరూ ట్విట్టర్ లో టికెట్ రేట్ల గురించి అడగలేదని వర్మ అన్నారు.

జగన్ కు వ్యతిరేకంగా సినిమా తీయగలరా అనే ప్రశ్నకు ఆర్జీవీ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కాళ్లను కొట్టడం గురించి సినిమా తీస్తారా అనే ప్రశ్నకు అది చాలా స్మాల్ ఇన్సిడెంట్ అని అని వర్మ అన్నారు.

Telugu Ap Poltics, Ap Ticket Rates, Cm Jagan, Jagan, Heart Rk, Raghurama, Ram Gopal Varma, Tollywood-Movie

రఘురామ కృష్ణంరాజు గురించి రెండు గంటల సినిమా తెరకెక్కించడం కష్టమని వర్మ వెల్లడించారు.ఆర్కే మాత్రం వర్మ వోడ్కా వేసుకుంటే స్టోరీ తయారు చేయడం ఎంతసేపు అని అన్నారు.వివేకానందరెడ్డి హత్య గురించి తీయాలని ఆ తర్వాత అర్కే వర్మను కోరారు.ఆదివారం రోజు రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

#AP Ticket Rates #CM Jagan #Heart #RaghuRama #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube