మూడేళ్లకు ఓ సినిమా ఏంటి జక్కన్న.. అలా చేయడం అన్యాయం అంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.అయితే గడిచిన పదేళ్లలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు మాత్రమే థియేటర్లలో విడుదలయ్యాయి.

 Star Director Rajamouli Mistake In That Matter Details, Rajamouli, Rajamouli Mov-TeluguStop.com

బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు గత పదేళ్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

మరోవైపు మహేష్ రాజమౌళి కాంబో సినిమా 2025లో విడుదలవుతుందో లేక 2026లో విడుదలవుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

రాజమౌళి లాంటి ప్రతిభ ఉన్న దర్శకుడు తక్కువ సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరం కావడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల షూటింగ్ వేగంగా జరిగేలా జక్కన్న ప్లాన్ చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

కెరీర్ తొలినాళ్లలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత లేని సినిమాలను తెరకెక్కించడంతో జక్కన్న సినిమాలు వేగంగానే తెరకెక్కాయి.

Telugu Allu Arjun, Bahubali, Mahesh Babu, Pawan Kalyan, Rajamouli, Rajamouli Fan

ప్రస్తుతం రాజమౌళి గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన సినిమాలు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయి.రాజామౌళి గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదని అయితే అదే సమయంలో వేగంగా షూటింగ్ పూర్తయ్యే విధంగా జక్కన్న ప్లాన్ చేయాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి సినిమాల నిర్మాతలకు అసలు బడ్జెట్ తో పోల్చి చూస్తే వడ్డీల రూపంలోనే ఊహించని స్థాయిలో భారం పెరుగుతుండటం గమనార్హం.

Telugu Allu Arjun, Bahubali, Mahesh Babu, Pawan Kalyan, Rajamouli, Rajamouli Fan

సీనియర్ డైరెక్టర్లలో చాలామంది తమ సినీ కెరీర్ లో 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.రాజమౌళి తన సినీ కెరీర్ లో కనీసం 20 కంటే ఎక్కువ సినిమాలకు డైరెక్షన్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు జక్కన్న టాలీవుడ్ హీరోలైన పవన్ కళ్యాణ్, బన్నీలతో కూడా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు జక్కన్న రేంజ్ పెరుగుతోందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం మూడేళ్లకు ఒక సినిమా చేస్తూ జక్కన్న తమకు అన్యాయం చేస్తున్నారని కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube