పునీత్ రాజ్ కుమార్ గొప్పదనం ఇదే.. కీలక వ్యాఖ్యలు చేసిన జక్కన్న!

Star Director Rajamouli Interesting Comments About Puneeth Raj Kumar

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి మూడు పాటలను రిలీజ్ చేసిన జక్కన్న త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

 Star Director Rajamouli Interesting Comments About Puneeth Raj Kumar-TeluguStop.com

కన్నడలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కొరకు బెంగళూరుకు వెళ్లిన రాజమౌళి జనని కన్నడ పాటను రిలీజ్ చేసి ఆ తర్వాత బెంగళూరులోని సదాశివనగర్ లో ఉన్న పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లారు.

పునీత్ వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్ కు జక్కన్న ధైర్యం చెప్పారు.

 Star Director Rajamouli Interesting Comments About Puneeth Raj Kumar-పునీత్ రాజ్ కుమార్ గొప్పదనం ఇదే.. కీలక వ్యాఖ్యలు చేసిన జక్కన్న-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పునీత్ రాజ్ కుమార్ పక్కింటి వ్యక్తిలా అందరితో కలిసిపోయేవారని పునీత్ చరిత్రలో నిలిచిపోతారని జక్కన్న చెప్పుకొచ్చారు.పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరు అనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాజమౌళి కామెంట్లు చేశారు.

పునీత్ రాజ్ కుమార్ ను తాను చాలా తక్కువసార్లు కలిశానని రాజమౌళి పేర్కొన్నారు.పునీత్ లేని లోటును ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారని రాజమౌళి తెలిపారు.

పునీత్ ను నాలుగేళ్ల క్రితం ఇదే ఇంట్లో కలిశానని పునీత్ దూరమైన తర్వాత ఆయన ఇంటిదగ్గర ఈ విధంగా మాట్లాడతానని తాను ఊహించలేదని జక్కన్న కామెంట్లు చేశారు.

Telugu Censor, Kananda, Rajamouli, Rajamoulimet, Rrr-Movie

ప్రస్తుత కాలంలో సాయం చేస్తే ఎవరైనా చెప్పుకుంటారని పునీత్ మాత్రం చనిపోయే వరకు తను చేసిన సమాజ సేవ గురించి ఈ ప్రపంచానికి తెలియకుండా చేశారని జక్కన్న వెల్లడించారు.అదే పునీత్ రాజ్ కుమార్ గొప్పదనమని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

Telugu Censor, Kananda, Rajamouli, Rajamoulimet, Rrr-Movie

పునీత్ రాజ్ కుమార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని రాజమౌళి చెప్పుకొచ్చారు.రాజమౌళి పునీత్ గురించి పాజిటివ్ గా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు సమాచారం.

#Rrr #Kananda #Rrr Certificate #Censor #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube