బాహుబలి కోటను రాజమౌళి బద్దలు కొడతారా.. ఆర్ఆర్ఆర్ తో సాధ్యమంటూ?

Star Director Rajamouli Confidence On Rrr Movie

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ కావడానికి సమయం తక్కువగా ఉండటంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు.

 Star Director Rajamouli Confidence On Rrr Movie-TeluguStop.com

వరుసగా సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.ఎన్నో అడ్డంకులను అధిగమించి రాజమౌళి వచ్చే నెలలో ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయనున్నారు.

సంక్రాంతికి ఊహించని స్థాయిలో పోటీ ఉన్నా, పోటీ వల్ల భారీగా కలెక్షన్లు తగ్గే ఛాన్స్ ఉన్నా రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో వెనుకడుగు వేయకూడదని అనుకుంటున్నారు.ఇప్పటికే ట్రైలర్ సిద్ధమైందని సరైన డేట్ ను చూసి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని సమాచారం.బాహుబలి, బాహుబలి2 సినిమాలతో కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.

 Star Director Rajamouli Confidence On Rrr Movie-బాహుబలి కోటను రాజమౌళి బద్దలు కొడతారా.. ఆర్ఆర్ఆర్ తో సాధ్యమంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఊహించని రికార్డులను క్రియేట్ చేసింది.ఆ సినిమా కలెక్షన్ల రికార్డులను మరే సినిమా బ్రేక్ చేయలేదు.

Telugu Budget, Advance, Bahubali, Break, Rajamouli, Pan India, Prabhas, Ram Charan, Tollywood-Movie

బాహుబలి 2 కథ, కథనం ఆసక్తికరంగా ఉండటంతో పాటు షాకింగ్ ట్విస్ట్ ఆ సినిమాకు హైలెట్ గా నిలిచింది.అయితే ఆర్ఆర్ఆర్ తో ఆ రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు కాగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా 700 కోట్ల రూపాయలు సాధించాలి.

Telugu Budget, Advance, Bahubali, Break, Rajamouli, Pan India, Prabhas, Ram Charan, Tollywood-Movie

రాజమౌళి సైతం బాహుబలిని మించిన టార్గెట్ ను సునాయాసంగా సాధిస్తానని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా నాలుగేళ్లు శ్రమించారు.మూడుసార్లు వాయిదా పడిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ఖచ్చితంగా రిలీజ్ కానుంది.అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా కొత్త రికార్డులు సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

#Prabhas #Rajamouli #Ram Charan #Advance #Bahubali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube