ఆర్‌ఆర్‌ఆర్‌లో తారక్ కనిపించేది 30 నిమిషాలే.. రాజమౌళి ఏమన్నారంటే?

దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి వేర్వేరు గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.ఈ సినిమాలో తారక్ అరగంట మాత్రమే కనిపిస్తాడని సోషల్ మీడియాలో రూమర్లు వైరల్ అవుతున్నాయి.

 Star Director Rajamouli Comments About Rrr Movie Details, Interesting Facts, Raj-TeluguStop.com

సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండగా చరణ్ కే రాజమౌళి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కొందరు ప్రచారం చేస్తున్నారు.అయితే ఈ రూమర్ల గురించి, కామెంట్ల గురించి రాజమౌళి స్పందించారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో తారక్ ను నిజంగా అరగంట మాత్రమే చూపిస్తే అభిమానులు అంగీకరిస్తారా? అని జక్కన్న ప్రశ్నించారు.సినిమాలో ఏ పాత్ర ఎంత సమయం కనిపిస్తుందనే వివరాలను ఇప్పుడు వెల్లడించడం సరి కాదని జక్కన్న చెప్పుకొచ్చారు.

సినిమా డైరెక్టర్ ను కాకపోతే తాను డ్రైవర్ ను అయ్యేవాడినని తనకు డ్రైవింగ్ బాగా వచ్చని జక్కన్న తెలిపారు.శాంతినివాసం సీరియల్ షూటింగ్ సమయంలోనే తాను పెద్ద డైరెక్టర్ అవుతానని అనిపించిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

తగిన ప్రయాణం ద్వారా మాత్రమే ఏ రంగంలో అయినా సక్సెస్ సాధించవచ్చని భావిస్తున్నానని రాజమౌళి పేర్కొన్నారు.

Telugu Puri Jagannath, Rajamouli, Ram Charan, Rrr, Tollywood-Movie

ఒక్కో సమయంలో ఒక్కో దర్శకుడు తనకు ఇన్స్పిరేషన్ అని రాజమౌళి వెల్లడించారు.మెల్ గిబన్ టేకింగ్ స్టైల్ తనకు ఇష్టమని రాజమౌళి అన్నారు.బాహుబలి సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి పిల్లలు కూడా ఒక కారణమని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Telugu Puri Jagannath, Rajamouli, Ram Charan, Rrr, Tollywood-Movie

మనస్సులో ఉండే విజువల్స్ ను తెరపై చూపిస్తాననే నమ్మకం తనకు కలిగిన సమయంలో మాత్రమే మహాభారతం సినిమాను తెరకెక్కిస్తానని రాజమౌళి పేర్కొన్నారు.ఆరు నెలలలో సినిమా షూటింగ్ ను పూర్తి చేసే మహానుభావుడు పూరీ జగన్నాథ్ మాత్రమేనని రాజమౌళి అన్నారు.షూటింగ్ త్వరగానే పూర్తైనా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల సినిమా లేటవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.తక్కువ సమయంలో పూరీ జగన్నాథ్ షూటింగ్ ను ఎలా పూర్తి చేస్తారో తనకు తెలియదని రాజమౌళి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube