ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ వివరాలివే.. రాజమౌళి వాటా ఎంతంటే?

రాజమౌళి డైరెక్షన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటించారు.

 Star Director Rajamouli And Rrr Movie Heroes Remunerations Details, Rajamouli, R-TeluguStop.com

వచ్చే ఏడాది జనవరి నెల 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ మల్టీస్టారర్ సినిమాను చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఈ పాత్ర కోసం చరణ్ ఏకంగా 45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని బోగట్టా.ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కూడా దాదాపుగా ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నారు.

ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన అజయ్ దేవగణ్ కు 25 కోట్ల రూపాయలు పారితోషికంగా దక్కింది.రాజమౌళిని రిక్వెస్ట్ చేసి ఆర్‌ఆర్‌ఆర్‌ లో ఛాన్స్ దక్కించుకున్న అలియాభట్ కు 9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ దక్కింది.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకు తనకు, తన కుటుంబ సభ్యులకు ప్యాకేజీ తీసుకోవడంతో పాటు లాభాల్లో 30 శాతం వాటా తీసుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం.

Telugu Ajay Devgan, Alia Bhatt, Dvv Danayya, Olivia Morris, Pan India, Rajamouli

నిర్మాత దానయ్య ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బడ్జెట్ లో దాదాపుగా 50 శాతం రెమ్యునరేషన్లకే కేటాయించారని బోగట్టా.శ్రియ, ఒలీవియా మోరిస్ లకు కూడా భారీ మొత్తం పారితోషికం దక్కిందని తెలుస్తోంది.రాజమౌళి కేరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఆర్‌ఆర్‌ఆర్‌ తెరకెక్కింది.

Telugu Ajay Devgan, Alia Bhatt, Dvv Danayya, Olivia Morris, Pan India, Rajamouli

దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా రిజల్ట్ పై కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.అయితే పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలవుతుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్ టెన్షన్ పడుతున్నారు.ఆర్‌ఆర్‌ఆర్‌ అంచనాలను మించి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube