ఆ దర్శకునిపై బాలకృష్ణ అభిమానులు కోపంగా ఉన్నారట.. ఏం జరిగిందంటే?

Star Director Puri Jagannath Interesting Comments About Balakrishna

ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే స్టార్ హీరో బాలయ్య భిన్నమనే సంగతి తెలిసిందే.హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా తనకు నచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి బాలకృష్ణ ఏ మాత్రం వెనుకాడరు.

 Star Director Puri Jagannath Interesting Comments About Balakrishna-TeluguStop.com

బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు యావరేజ్ టాక్ రాగా కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో బాలయ్య అభిమానులు నిరాశ చెందారు.

అయితే బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి హాజరయ్యారు.నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది.

 Star Director Puri Jagannath Interesting Comments About Balakrishna-ఆ దర్శకునిపై బాలకృష్ణ అభిమానులు కోపంగా ఉన్నారట.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ షోలో బాలకృష్ణ పూరీ జగన్నాథ్ తో మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ మనస్పూర్తిగా లవ్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా పూరీ జగన్నాథ్ ఆ ప్రశ్నకు స్పందిస్తూ బాలయ్య పేరును సమాధానంగా చెప్పారు.పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలను బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

గతంలో పూరీ జగన్నాథ్ బాలయ్య మాటపై నిలబడే హీరో అని మనుషులకు ఆయన ఎంతో విలువ ఇవ్వడంతో పాటు బాలయ్యకు క్యారెక్టర్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Charmi, Liger, Paisa Vasool, Puri Jagannath-Movie

ఈ షోలో బాలయ్య పైసా వసూల్ సినిమా రిజల్ట్ గురించి స్పందిస్తూ ఆ సినిమా డిఫరెంట్ మూవీ అని ఆ సినిమాలో తాను పాట కూడా పాడానని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ పైసా వసూల్ సినిమా సక్సెస్ సాధించక పోవడంతో బాలయ్య అభిమానులు తనపై కోపంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Charmi, Liger, Paisa Vasool, Puri Jagannath-Movie

బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ సినిమా తీసి రుణాన్ని తీర్చుకుంటానని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.బాలయ్య పాలిటిక్స్ తో, సినిమాలతో బిజీగా ఉంటూనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

#Liger #Puri Jagannath #Paisa Vasool #Charmi #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube