పదేళ్లకే ప్రేమలేఖ రాసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..!  

Star Director Puri Jagannaadh comments about individuality, Parents, love letter, Puri musings, Puri Jagannaadh , Nature - Telugu Individuality, Love Letter, Nature, Parents, Parents Children Relationship, Puri Jagannaadh, Puri Jagannadh, Puri Musings, Star Director Puri Jagannaadh Comments About Individuality

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యూట్యూబ్ లో పూరీ మ్యూజింగ్స్ ద్వారా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా పూరీ ఇండివిడ్యువాలిటీ అనే అంశం గురించి స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

TeluguStop.com - Star Director Puri Comments About Individuality

పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేయడంతో పాటు వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను షేర్ చేసుకున్నారు.
చాలామంది తల్లిదండ్రులు తమ కోరికలను పిల్లలపై రుద్దుతుంటారని.

అలా కాకుండా పిల్లలకు స్వేచ్చను ఇస్తే వారికంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు.పిల్లల విషయంలో కఠినంగా వ్యవహరించవద్దని తల్లిదండ్రులకు సూచనలు చేశారు.

TeluguStop.com - పదేళ్లకే ప్రేమలేఖ రాసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తల్లిదండ్రులు పిల్లలపై ఉండే ఇష్టం, ప్రేమ వల్లే పిల్లలకు చిన్నచిన్న ఆనందాలను దూరం చేస్తున్నారని.వర్షంలో తడవకుండా, బురదలో ఆడుకోకుండా చేస్తున్నామంటే వారిని ప్రకృతికి దూరం చేయడమేనని అన్నారు.
తల్లిదండ్రులు చేసే ఇలాంటి తప్పుల వల్లే పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుందని పేర్కొన్నారు.చదువు విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలే తప్ప మన అభిప్రాయాలు వారిపై రుద్దకూడదని అన్నారు.

తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన, వ్యక్తిత్వం ఇవ్వాలని.పిల్లలు కూడా కొన్ని విషయాలను కష్టపడే తెలుసుకోవాలని.కష్టపడే తెలుసుకుంటారని చెప్పారు.పిల్లలు అవగాహన వల్ల మంచి, చెడుల గురించి తెలుసుకుంటారని, వ్యక్తిత్వం వల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని అన్నారు.

కష్టపడతారు కాబట్టే తన సినిమాల్లో హీరోలు ఎంతో ధృఢంగా ఉంటారని తెలిపారు.

పిల్లలతో బంగారం అనే పదాలు పిలుస్తూ మాట్లాడితే కుటుంబం డ్రామా కంపెనీలా ఉంటుందని అన్నారు.

తాను పదేళ్లకే లవ్ లెటర్ రాశానని.తర్వాతి తరం ఇంకా అడ్వాన్స్ కాబట్టి పిల్లలను పెంచే ఆలోచనా తీరులో మార్పు రావాలని పూరీ అన్నారు.

మన పిల్లలకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు.

#Puri Jagannadh #Puri Jagannaadh #StarDirector #Puri Musings #Love Letter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Director Puri Comments About Individuality Related Telugu News,Photos/Pics,Images..