రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్..?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో ఉగ్రమ్ సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ తొలి సినిమాతోనే భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

 Star Director Prashant Neel Shocking Comments About His Remuneration, #salaar, K-TeluguStop.com

ఆ సినిమా తరువాత కేజీఎఫ్ సినిమాకు డైరెక్షన్ చేసి ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

కేజీఎఫ్ ఛాప్టర్ 1కు కొనసాగింపుగా కేజీఎఫ్ ఛాప్టర్2 తెరకెక్కగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.కేజీఎఫ్2 షూటింగ్ ను కొన్ని నెలల క్రితమే పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కొరకు 10 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న సినిమాకు సైతం 10 కోట్ల రూపాయలు నిర్మాతలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చాయి.

మరోవైపు శంకర్, రాజమౌళి స్థాయిలో ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయలు పారితోషికం డిమాండ్ చేశారనే ప్రచారం కూడా జరిగింది.అయితే ఒక ఆంగ్ల వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ పారితోషికం గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని అన్నారు.

పారితోషికం గురించి ప్రస్తావించడం కూడా తనకు అస్సలు నచ్చదని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.

Telugu Salaar, Kgf, Ntr, Prashant Neel-Movie

టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ గురించి ఈ విధంగా కామెంట్లు చేయడం గమనార్హం.మరోవైపు ప్రశాంత్ నీల్ కు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు ఇస్తున్నట్టు తెలుస్తోంది.మరి కొన్నేళ్లు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్ హీరోలతోనే సినిమాలు తీయనున్నారని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube