ఈ హీరోయిన్ సగం వైట్‌, సగం బ్లాక్‌లో రెమ్యునరేషన్ ఇమ్మని అడిగారట.. చివరకు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలు తెరకెక్కించిన దర్శకులలో ముత్యాల సుబ్బయ్య ఒకరు.ముత్యాల సుబ్బయ్య తాను చాలా సంస్థలలో పని చేశానని అయితే ఉషాకిరణ్ మూవీస్ లో కూడా అవకాశం వస్తే బాగుంటుందని భావించిన సమయంలో తనకు అక్కడ పని చేసే అవకాశం దక్కిందని అన్నారు.

 Star Director Mutyala Subbaiah Comments About Heroine Simran-TeluguStop.com

ఘటికాచలం చెప్పిన కథ రామోజీరావుకు నచ్చడంతో దీవించండి అనే టైటిల్ తో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాను ప్లాన్ చేశామని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

హీరోగా శ్రీకాంత్ ఎంపిక కాగా హీరోయిన్ కోసం సిమ్రాన్ ను ప్రయత్నించామని అయితే రెమ్యునరేషన్ విషయంలో సమస్య ఏర్పడిందని ముత్యాల సుబ్బయ్య తెలిపారు.

 Star Director Mutyala Subbaiah Comments About Heroine Simran-ఈ హీరోయిన్ సగం వైట్‌, సగం బ్లాక్‌లో రెమ్యునరేషన్ ఇమ్మని అడిగారట.. చివరకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిమ్రాన్ సగం రెమ్యునరేషన్ ను వైట్ లో, సగం రెమ్యునరేషన్ ను బ్లాక్ లో ఇమ్మని అడిగారని అయితే ఉషాకిరణ్ మూవీస్ చెక్ రూపంలో మాత్రమే పేమెంట్లు చేస్తారు కాబట్టి అందుకు అంగీకరించలేదని ముత్యాల సుబ్బయ్య వెల్లడించారు.

Telugu Black Remuneration, Comments, Devinchadi Movie, Malavika, Muthyala Subbaiah, Mutyala Subbayya, Rasi, Simran, White Remuneration-Movie

ఆ తర్వాత ఈ సినిమాలో రాశి, మాళవిక హీరోయిన్లుగా ఎంపికయ్యారని సినిమాకు బాగా పబ్లిసిటీ చేయడంతో బీ, సీ సెంటర్లలో ఈ సినిమా బాగా ఆడిందని ముత్యాల సుబ్బయ్య చెప్పుకొచ్చారు.ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత తాను టి.కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ ను కలిశానని ఏం చేద్దామని అనుకుంటున్నావని గోపీచంద్ ను అడగగా రష్యా నుంచి వచ్చేశానని ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని గోపీచంద్ చెప్పారని ముత్యాల సుబ్బయ్య అన్నారు.

Telugu Black Remuneration, Comments, Devinchadi Movie, Malavika, Muthyala Subbaiah, Mutyala Subbayya, Rasi, Simran, White Remuneration-Movie

గోపీచంద్ బ్రదర్ ప్రేమ్ చంద్ తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని గోపీచంద్ కూడా డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేస్తారేమో అని భావించగా గోపీచంద్ తో పాటు వచ్చిన టి.కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ అధినేత నాగేశ్వరరావు గోపీచంద్ ఆర్టిస్ట్ కావాలని అనుకుంటున్నాడని చెప్పారని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు.

#Devinchadi #White #Black #Simran #Rasi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు