మిర్చి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టి తొలి సినిమాతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు కొరటాల శివ.మిర్చి సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి.
ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఆచార్య సినిమాలో చరణ్ సిద్ధా పాత్రలో 40 నిమిషాల పాటు సెకండాఫ్ లో కనిపిస్తారని చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోందని తెలుస్తోంది.ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి టెంపుల్ సెట్ వేశారు.
టెంపుల్ సెట్ కు సంబంధించిన వీడియోను గతంలో మెగాస్టార్ చిరంజీవి చూపించారు.టెంపుల్ సెట్ యొక్క సింహ ద్వారం మాత్రమే ఆ వీడియోలో కనిపించింది.
టెంపుల్ సెట్ కు సంబంధించిన ఇతర విషయాలు మాత్రం వెల్లడి కాలేదు.అయితే ఆచార్య సెట్ కు వచ్చిన చరణ్ ఫ్యాన్స్ టెంపుల్ సెట్ దగ్గర దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
టెంపుల్ సెట్ కు సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో కొరటాల శివ ఆచార్య సెట్ లో ఫైర్ అయ్యారని.సెట్ లోకి ఎవరినీ రానివ్వవద్దని చెప్పినట్టు తెలుస్తోంది.
గతంలో కూడా కొన్ని సినిమాలు ఫోటోలు, వీడియోలు విడుదలకు ముందే లీక్ కావడం వల్ల నష్టపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ ఏడాది సెకండాఫ్ లో ఆచార్య విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.కొరటాల శివ ఈ సినిమా తరువాత బన్నీ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.