అగ్రహీరోని అవమానించిన అగ్రదర్శకుడు

ఆయనొక అగ్రదర్శకుడు .అంతా అగ్రహీరోలతోనే సినిమాలు చేసారు.

దర్శకులలందరిలో ఆయనది ఒక ప్రత్యెక శైలి.ఇండస్ట్రీలో ఆయనకీ అంతా మంచి స్నేహితులే.

ఒక మంచి కథ సిద్ధం చేసుకోని, ఆయన ఇప్పటికే పనిచేసిన ఒక అగ్రహీరో దగ్గరికి వెళ్ళారు.అయితే కథ సగం మాత్రమె సిద్ధంగా ఉండటంతో ఫస్టాఫ్ మాత్రమె చెప్పారు.

మిగితా సగం కుడా కావాలి, అది విన్నాకే నిర్ణయం చెబుతా అని అన్నాడు ఆ హీరో.ఎంత మంచి మిత్రుడైన, పని పనే కాదా అని సర్దిచెప్పుకున్నాడు ఆ దర్శకుడు.

సమయం తీసుకొని మళ్ళి వస్తా అని చెప్పాడు దర్శకుడు.

ఆ తరువాత మరో అగ్రహీరోకి కథ చెప్పడానికి వెళ్ళాడు దర్శకుడు.

ఈసారి వేరే కథ చెప్పాడు.కాని ఆ హీరోకి మొన్న చెప్పిన కథ నాకు కుడా చెప్పండి అని అడిగాడు ఆ హీరో.

చెప్పను అని కరాఖండిగా చెప్పేసాడు ఆ దర్శకుడు.నేను ఆ కథ అనుకుంది మీకోసం కాదు, ఆయన కోసం, ఆయన ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడే చేస్తా, ఆయనతో మాత్రమె చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పేసాడు దర్శకుడు.

ఈ సంఘటనని పెద్ద అవమానంగా ఫీల్ అయ్యాడట ఆ హీరో.

ఇప్పుడు ఆ ఇద్దరితో కాకుండా వేరే హీరోతో సినిమా చేస్తున్న ఆ దర్శకుడు, ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తీ అయ్యాక మొదటి కథ చెప్పిన హీరోతోనే సినిమా మొదలుపెదతారట.

ఈ లెక్కన రెండో హీరోని పట్టించుకోవట్లేదు కదా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube