మహేష్ నమ్రతల లవ్ స్టోరీపై బి.గోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అక్కడే మొదలైందంటూ?

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో మహేష్ నమ్రత కపుల్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మహేష్ కెరీర్ లో సక్సెస్ సాధించడం కోసం నమ్రత ఎంతో కష్టపడుతున్నారు.

 Star Director B Gopal Comments About Mahesh Namrata  Love Story Details, Mahesh-TeluguStop.com

వంశీ సినిమా షూటింగ్ సమయంలో మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారు.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అనే సంగతి తెలిసిందే.

ఒక ఇంటర్వ్యూలో బి.గోపాల్ మహేష్, నమ్రతల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వంశీ సినిమాలో మొదట నమ్రతను ఎంపిక చేయలేదని మేకప్ టెస్ట్ చేస్తే హీరోయిన్ సెట్ కాకపోవడంతో ఆ తర్వాత నమ్రతను ఎంపిక చేయడం జరిగిందని బి.గోపాల్ అన్నారు.వంశీ సినిమా షూటింగ్ 40 రోజుల పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరిగిందని బి.గోపాల్ అన్నారు.ఒక ట్రైన్ లో కంపార్ట్ మెంట్ ను బుక్ చేసుకుని ట్రైన్ గార్డ్ ను రిక్వెస్ట్ చేసి సీన్లు చేశామని బి.గోపాల్ తెలిపారు.

విల్లింగ్ టన్ స్టేషన్ లో బ్రహ్మాండంగా సీన్లు తీశామని ఆ సినిమాలో పాటలు కూడా బాగుంటాయని బి.గోపాల్ పేర్కొన్నారు.

Telugu Gopal, Love Story, Mahesh Babu, Mahesh Namrata, Maheshnamratha, Namratha,

ఆ సినిమాలో ట్రైన్ సీన్లు తనకు నచ్చాయని బి.గోపాల్ అన్నారు.మహేష్, నమ్రత ప్రేమలో ఉన్నారని తనకు తెలియదని న్యూజిలాండ్ షెడ్యూల్ సమయంలో మహేష్, నమ్రతకు పరిచయం ఏర్పడిందని వాళ్లు ఇష్టపడ్డారని పెళ్లి చేసుకున్నారని బి.గోపాల్ తెలిపారు.

Telugu Gopal, Love Story, Mahesh Babu, Mahesh Namrata, Maheshnamratha, Namratha,

ఊటీ, కొడైకొనాల్, మున్నార్ లో ఎక్కువగా షూటింగ్ లు చేశామని కశ్మీర్ అద్భుతమైన లొకేషన్ అని బి.గోపాల్ తెలిపారు.ఐదుసార్లు స్విట్జర్లాండ్ కు, రెండుసార్లు కెనడాకు వెళ్లి షూటింగ్ చేశానని బి.గోపాల్ చెప్పుకొచ్చారు.బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ సినిమా కొన్నిరోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube