సూర్య కుమార్ యాదవ్ భవిష్యత్తును నాశనం చేసిన స్టార్ క్రికెటర్....

ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టీమిండియా జట్టులో మిస్టర్ 360.కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల తర్వాత అంతటి ఫ్యాన్‌ బేస్ ఉన్న క్రికెటర్‌.

 Star Cricketer Who Ruined The Future Of Surya Kumar Yadav , Star Cricketer, Su-TeluguStop.com

తన 360 డిగ్రీ బ్యాటింగ్‌తో అతి తక్కువ కాలంలోనే ఇండియన్‌ టీమ్‌కు బ్యాక్‌బోన్‌గా మారిపోయాడు.సూర్యకుమార్‌ యాదవ్‌ గ్రౌండ్‌కు అన్ని వైపులా కళ్లు చెదిరే షాట్లు ఆడుతూ స్టార్‌ ప్లేయర్‌గామారిపోయాడు.

ఇలాంటి ఆటగాడిని గుర్తించడంలో టీమిండియా మాజీ ఆటగాడు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు రెండు ఐపీఎల్‌ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ విఫలం అయ్యాడు.

గంభీర్‌తన టీమ్‌లో కొన్ని ఏళ్ల పాటు ఆడిన ఆటగాడి టాలెంట్‌ను గుర్తించలేకపోయాడు.2014-2017 వరకు సూర్యకుమార్‌ యాదవ్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఆ టైమ్‌లో గంభీర్‌ కేకేఆర్‌ కెప్టెన్‌.తుది జట్టులో సూర్యకు ప్లేస్‌ ఇస్తున్నా,బ్యాటింగ్‌కు దింపే స్థానంలో గంభీర్‌ ఫెయిల్‌ అయ్యాడు.2014 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి కేకేఆర్‌లో సూర్య రెగ్యులర్‌ ప్లేయర్‌గా మారినప్పటికీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మాత్రం చివర్లో ఉండిపోయాడు.అయినా కూడా తనకు వచ్చిన కొన్ని బంతుల్లోనే వీలైన్ని ఎక్కువ పరుగులు చేస్తూ వచ్చాడు.2015 సీజన్‌లో మళ్లీ ముంబై ఇండియన్స్‌పైనే 20 బంతుల్లో 46 పరుగులు చేసి కేకేఆర్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.ఇక్కడి నుంచి 2016 వరకు సూర్యకుమార్‌ యాదవ్‌ను గంభీర్‌ 4వ స్థానంలోనే బ్యాటింగ్‌ దింపాడు.మళ్లీ తిరిగి 2017లో లోయర్‌ ఆర్డర్‌కు పరిమితం చేశాడు.

2018లో సూర్యకుమార్‌ యాదవ్‌ను వేలంలో దక్కించుకున్న ముంబై ఇండియన్స్ అతన్ని 4వ స్థానంలోనే ఆడించింది.ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూర్య టాలెంట్‌ను గుర్తించి అతనికి సరిపోయే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ కు పంపాడు.ముంబై కెప్టెన్‌ రోహితే టీమిండియాకు కెప్టెన్‌ కావడంతో సూర్యకుమార్‌ అదే 4వ స్థానంలో అదరగొడుతున్నాడు.అయితే సూర్యలోని టాలెంట్‌ను గౌతమ్‌ గంభీర్‌ కనుక 2014లోనే గమనించి ఉంటే, ఇప్పటికే సూర్య ఒక రేంజ్‌లో ఉండేవాడు.

ఐపీఎల్‌ ఆడిన టైమ్‌లోనే జాతీయ జట్టు కూడా ఆడి అద్భుతాలు చేసేవాడు.కేవలం కెప్టెన్‌గా గంభీర వైఫల్యంతోనే సూర్యకుమార్‌ యాదవ్‌ కెరీర్‌లో కొంత వెనుక బడ్డాడని అతని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube