ప్రముఖ కమెడియన్ సునీల్ జాబితాలో 10,000 సినిమాలు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కమెడియన్లలో సునీల్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ లో బిజీ అయిన కమెడియన్ ఎవరనే ప్రశ్నకు సునీల్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.

 Star Comedian Sunil 1000 Movies Details Here Goes Viral , 10000 Movies, Shocking Facts, Star Comedian, Sunil-TeluguStop.com

ఎన్నో పెద్ద సినిమాల సక్సెస్ లో సునీల్ కీలక పాత్ర పోషించారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో సునీల్ కు మంచి పాత్రలు దక్కగా ఆ పాత్రల వల్ల సునీల్ కెరీర్ విషయంలో మరింత ఎత్తుకు ఎదిగారు.

అయితే సినిమాలలో నటించడమే కాకుండా సినిమాలు చూడటానికి తెగ ఇష్టపడే హీరోలలో ఒకరైన సునీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సినిమా సీడీలను కలెక్ట్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని తన ఇంట్లో 12,000 సీడీలు ఉన్నాయని అన్నీ ఒరిజినల్ సీడీలని ఏ దేశం వెళ్లినా సీడీలు కొనుక్కుంటానని సునీల్ కామెంట్లు చేశారు.

 Star Comedian Sunil 1000 Movies Details Here Goes Viral , 10000 Movies, Shocking Facts, Star Comedian, Sunil-ప్రముఖ కమెడియన్ సునీల్ జాబితాలో 10,000 సినిమాలు.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందు తరాల నటనను చూడటం చాలా ఇష్టమని సునీల్ అన్నారు.

వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవడం తనకు ఆసక్తి అని సునీల్ కామెంట్లు చేశారు.

అన్ని భాషల సీడీలను తాను కొనుగోలు చేశానని అయితే ఇప్పటివరకు ఆ సినిమాలలో 2,000 సినిమాలను మాత్రమే చూడగలిగానని ఆయన తెలిపారు.తాను చూడాల్సిన సినిమాలు 10,000 ఉన్నాయని అయితే లైఫ్ టైమ్ లో అన్ని సినిమాలు చూడటం మాత్రం సాధ్యం కాదని ఆయన కామెంట్లు చేశారు.

మనం ఇప్పుడేదో చేస్తున్నామని భావిస్తున్నామని పెద్దోళ్లు అవి ఎప్పుడో చేసేశారని సునీల్ తెలిపారు.

Telugu Sunil-Movie

మన పెద్దవాళ్లు కామెడీ, యాక్షన్ లో చూపించని వేరియేషన్ లేదని సునీల్ కామెంట్లు చేశారు.ఎఫ్3 సినిమాలో సునీల్ కామెడీకి మంచి మార్కులు పడ్డాయి.కమర్షియల్ గా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించింది.ఎఫ్3 సక్సెస్ తో సునీల్ కు ఆఫర్లు పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube