ఈ స్టార్ కమెడియన్ డబ్బుల కోసం అద్దాలు తుడిచాడట.. ఏం జరిగిందంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న కమెడియన్లలో సత్య ఒకరు.సత్య గతేడాది హీరోగా నటించి విడుదలైన వివాహ భోజనంబు హిట్ గా నిలిచింది.

 Star Comedian Satya Career Troubles Details, Satya, Vivaha Bhojanambu, Comedian Satya, Satya Movie Offers, Comedian Satya Life Struggles, Tollywood, Drona Movie, Comedian Satya Career-TeluguStop.com

తనదైన కామెడీ టైమింగ్ తో సత్య సినిమా ఆఫర్లతో పాటు విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.అయితే కేరీర్ తొలినాళ్లలో ఈ కమెడియన్ ఎన్నో కష్టాలను అనుభవించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సత్య తను అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

 Star Comedian Satya Career Troubles Details, Satya, Vivaha Bhojanambu, Comedian Satya, Satya Movie Offers, Comedian Satya Life Struggles, Tollywood, Drona Movie, Comedian Satya Career-ఈ స్టార్ కమెడియన్ డబ్బుల కోసం అద్దాలు తుడిచాడట.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కమెడియన్ సత్య సినిమాలపై ఉన్న ఇష్టంతో బీటెక్ లో మధ్యలోనే ఆపేసి 10,000 రూపాయల డబ్బులతో హైదరాబాద్ కు వచ్చారు.10,000 రూపాయలు ఉన్నంత వరకు సంతోషంగానే గడిపిన సత్యకు ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఇబ్బందులు మొదలయ్యాయి.చేతిలో డబ్బులు లేకపోవడంతో రోజుకు 200 రూపాయల చొప్పున వేతనం తీసుకుంటూ ఒక ఆస్పత్రిలో అద్దాలు తుడిచాననికమెడియన్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత సత్యకు కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లతో పరిచయం ఏర్పడింది.

Telugu @satya, Career Troubles, Satya, Satya Career, Satya Struggles, Drona, Satya Offers, Tollywood-Movie

సత్య దగ్గర ఉన్న కొంత మొత్తం డబ్బును కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ కొట్టేశారు.డబ్బులు లేకపోవడం వల్ల ఈ కమెడియన్ ఏకంగా మూడు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగి కడుపు నింపుకోవడం గమనార్హం.ఆ తర్వాత ద్రోణ సినిమాకు డైరెక్షన్ విభాగంలో పని చేసే ఛాన్స్ సత్యకు దక్కింది.

Telugu @satya, Career Troubles, Satya, Satya Career, Satya Struggles, Drona, Satya Offers, Tollywood-Movie

ఆ తర్వాత సినిమాలలో కమెడియన్ ఆఫర్లను అందుకుని సత్య సత్తా చాటారు.ప్రస్తుతం సత్యకు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. హీరోగా సత్య నటిస్తున్న మరో రెండు మూడు సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటే సత్యకు క్రేజ్ మరింత పెరుగుతుంది.సత్య అనుభవించిన కష్టాల గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

యంగ్ డైరెక్టర్లు ఈ కమెడియన్ కు ఎక్కువగా సినిమా ఆఫర్లను ఇస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube