వృద్ధుడుగా మారిపోయిన టాప్ కమెడియన్  

Star Comedian Old Age Look Viral In Social Media-

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు వెన్నెల కిషోర్.బ్రహ్మానందం, సునీల్, అలీ లాంటి స్టార్ కమెడియన్స్ ని దాటుకొని వారిని రిప్లేస్ చేసే స్థాయికి వెన్నెల కిషోర్ వెళ్ళిపోయాడు.ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటే కచ్చితంగా అందులో వెన్నెల కిషోర్ ఉండాల్సిందే..

Star Comedian Old Age Look Viral In Social Media--Star Comedian Old Age Look Viral In Social Media-

తనదైన టైమింగ్ కామెడీతో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకోవడంతో ఇప్పుడు, దర్శకులకి వెన్నెల కిషోర్ హాట్ కేక్ గా మారిపోయాడు.ఇదిలా ఉంటే వెన్నెల కిషోర్ సినిమాలలోనే కాకుండా బయట కూడా అప్పుడప్పు సోషల్ మీడియాలో ఫన్నీ ఫోటోలు, కామెంట్స్, మీమ్స్ షేర్ చేస్తూ తన ఫలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు.ఇప్పుడు మరోసారి ఆసక్తికరమైన ఫోటో షేర్ చేసి నవ్వులు పంచాడు.

తాను వృద్ధాప్యంలో ఎలా ఉండబోతున్నానో ఇప్పుడే చూడండి అంటూ వృద్ధుడు రూపంలో ఉన్న తన ఫోటోని షేర్ చేసాడు.ఇప్పుడు ఈ ఫోటో విపరీతంగా షేర్ అవుతుంది.తాజాగా వచ్చిన ఓ యాప్ మనం వృద్ధాప్యంలో ఎలా ఉండబోతున్నాం అనేది చూపిస్తుంది.

ఈ నేపధ్యంలో వెన్నెల కిషోర్ కూడా ఈ యాప్ మీద ఆసక్తి చూపించి తాను వృద్ధాప్యంలో ఎలా ఉంటానో చూసుకోవడంతో పాటు ట్విట్టర్ లో షేర్ చేయడం ద్వారా ఆ యాప్ కి ఫ్రీ ప్రమోషన్ చేసాడు.