ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ కమెడియన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల ఫ్రెండ్స్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తూ మధునందన్ గుర్తింపును సొంతం చేసుకున్నారు.నితిన్ హీరోగా నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మరికొన్ని సినిమాల్లోని పాత్రలు మధునందన్ కు నటుడిగా మంచిపేరును తెచ్చిపెట్టాయి.

 Star Comedian Madhu Nandan Comments On Jr Ntr, Best Actor, Bunny, Comments On Nt-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన మధునందన్ ను యాంకర్ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి వన్ వర్డ్ లో చెప్పాలని సూచనలు చేశారు.

యాంకర్ చిరంజీవి గురించి అడగగా మధునందన్ నభూతో నభవిష్యత్ అని చెప్పారు.

వెంకటేష్ గారు మోస్ట్ ఫన్నీయెస్ట్ హీరో ఆన్ స్క్రీన్ అని బాలకృష్ణ గారు లెజెండ్ అని నాగార్జున గారు ఎవర్ గ్రీన్ అని మధునందన్ చెప్పుకొచ్చారు.నాగార్జున అందం ఎవరికీ రాదని మధునందన్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ చరిత్ర అని రవితేజ అంటే ఎనర్జీ అని విజయ్ దేవరకొండ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అని మధునందన్ చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు ఆల్ ఇండియా అందగాడు అని రామ్ చరణ్ మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ అని మధునందన్ పేర్కొన్నారు.

అల్లు అర్జున్ మోస్ట్ హార్డ్ వర్కర్ అని ఎలా ఉండాలి ఒక యాక్టర్ అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని బన్నీ తమకు సచిన టెండూల్కర్ లాంటి వాడని మధునందన్ అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ గురించి యాంకర్ అడగగా హీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అని మధునందన్ వెల్లడించారు.

తన పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ అని మధునందన్ పేర్కొన్నారు.ఏ పాత్రకైనా ఎన్టీఆర్ ఫిట్ అవుతారని మధునందన్ తెలిపారు.నాగచైతన్య జెంటిల్ మేన్ అని పూజా హెగ్డే తన ఫేవరెట్ హీరోయిన్ అని మధునన్ందన్ తెలిపారు.సౌందర్య, కీర్తి సురేష్ కూడా తన ఫేవరెట్ హీరోయిన్లని మధునందన్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube