స్టార్ హీరో బన్నీ నా కళ్లజోడు పగలగొట్టాడు.. నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

స్టైలిష్ స్టార్ బన్నీ రెండు దశాబ్దాలుగా సినిమాల్లో హీరోగా కొనసాగుతూ టాలీవుడ్ నంబర్ 1 హీరో అనిపించుకోవాలని ఎంతో శ్రమిస్తున్నారు.ప్రముఖ నటుడు జెన్నీ ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Star Comedian Jenny Comments About Star Hero Allu Arjun-TeluguStop.com

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు మంచి వేషం ఇచ్చారని జెన్నీ చెప్పారు.ఆ సినిమాలో తాను హౌస్ ఓనర్ గా నటించానని జెన్నీ అన్నారు.

సినిమాలో అల్లు అర్జున్ కుటుంబం చితికిపోయి తన ఇంటిని రెంట్ తీసుకుంటే తాను వ్యంగ్యంగా కామెంట్లు చేస్తానని జెన్నీ అన్నారు.ఆ సమయంలో హీరోకు ఇరిటేషన్ వచ్చి లాగి కొడతాడని ఈ మధ్య సెన్సాఫ్ హ్యూమర్ ఉండటం లేదని అప్పుడప్పుడూ వస్తూ ఉండాలని చెబుతాడని జెన్నీ చెప్పుకొచ్చారు.

 Star Comedian Jenny Comments About Star Hero Allu Arjun-స్టార్ హీరో బన్నీ నా కళ్లజోడు పగలగొట్టాడు.. నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అల్లు అర్జున్ కొట్టే సమయంలో వరి వేలు తగలడంతో తన కళ్లజోడు కింద పడి విరిగిపోయిందని అయితే షాట్ ఓకే అయిందని జెన్నీ అన్నారు.

Telugu Allu Arjun, Comments, Dj Movie, Intresting Racts, Jenny, Son Of Sathayamurthi, Son Of Satyamurty, Star Comedian, Tollywood-Movie

అల్లు అర్జున్ కళ్లజోడు విరిగిపోవడంతో ఫీలై జెన్నీ గారికి కొత్త కళ్లజోడు కొనివ్వాలని మేనేజర్ కు చెప్పాడని జెన్నీ తెలిపారు.అయితే తాను లేదని వద్దని చెప్పానని జెన్నీ వెల్లడించారు.ఆ తర్వాత బన్నీ తన డబ్బులతోనే కొనుక్కోవాలని కోరగా తనకు బన్నీ సినిమాల్లో ఆఫర్లు ఇవ్వాలని కోరానని జెన్నీ వెల్లడించారు.

ఆ తర్వాత డీజే సినిమాలో తనకు ఛాన్స్ ఇప్పించారని జెన్నీ పేర్కొన్నారు.

Telugu Allu Arjun, Comments, Dj Movie, Intresting Racts, Jenny, Son Of Sathayamurthi, Son Of Satyamurty, Star Comedian, Tollywood-Movie

ఈవీవీ సత్యనారాయణ సినిమాలలో తాను ఎక్కువగా నటించానని జెన్నీ తెలిపారు.మార్వాడీ షేట్, పెళ్లికూతురు తండ్రి పాత్రలకు తనను ఎక్కువగా ఎంపిక చేసేవారని జెన్నీ వెల్లడించారు.తనకు పుస్తకాలు చదవడం అలవాటు అని నాలో ఉన్న రచయితను బ్రహ్మనందం బాగా ఎంకరేజ్ చేసేవారని జెన్నీ అన్నారు.

జెన్నీ ఇప్పటికీ వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

#Jenny #Sathayamurthi #DJ #Satyamurty #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు