స్టార్ కమెడియన్ మృతి... తీవ్ర విషాదంలో చిత్ర పరిశ్రమ

కన్నడ నాట స్టార్ కమెడియన్ తో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు బుల్లెట్ ప్రకాశ్.ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే కచ్చితంగా మంచి కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు.

 Star Comedian Bullet Prakash Died In Bangalore, Kannada Industry, Tollywood, Sou-TeluguStop.com

స్టార్ హీరోల సినిమాలలో బుల్లెట్ ప్రకాశ్ పండించిన కామెడీతో సినిమాలు హిట్ అయినవి కూడా ఉన్నాయి.తెలుగులో బ్రహ్మానందంకి ఏ స్థాయి గుర్తింపు ఉందో బుల్లెట్ ప్రకాశ్ కి అదే స్థాయిలో గుర్తింపు ఉంది.

ఈ స్టార్ కమెడియన్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే.అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు.

లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత, జీర్ణ కోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బుల్లెట్ ప్రకాశ్ ని మార్చి 31న ఆసుపత్రిలో చేర్చారు.భారీకాయంతో ఉండే బుల్లెట్ ప్రకాశ్ ఈ మధ్య ఏదో ట్రీట్మెంట్ తీసుకొని ఏకంగా 35 కిలోలు బరువు తగ్గారు.

తరువాత నుంచి అతనికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.ఈ మధ్య ఆయన పరిస్థితి మరింత విషమించడంతో హాస్పిటల్ లో చేర్చారు.ఊహించని విధంగా హాస్పిటల్ లోనే ఆయన తుది శ్వాస విడిచారు.కన్నడ, తమిళ భాషలలో 325 చిత్రాలలో ఆయన నటించారు.

ఆయన మృతిపై కన్నడ స్టార్ హీరోలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.బుల్లెట్ ప్రకాశ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube