Heros Original Names: సినీ ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్న స్టార్ హీరోలు వీళ్లే.. కొత్త పేర్లే కలిసొచ్చాయంటూ?

చాలామంది అభిమానులకు సినీ ప్రేక్షకులకు తెలియని విషయం ఏమిటంటే.సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి అసలు పేరును కాకుండా మరొక పేరుని మార్చుకున్నారు.

 Star Celebrities Original Names Are An Interesting Story-TeluguStop.com

అలా ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రిటీలు వారి పేర్లు మార్చుకున్నారు.సౌత్ – నార్త్ లో ఇలా పేర్లు మార్చుకున్న స్టార్లు ఎంద‌రో ఉన్నారు.

అసలు పేర్లను మార్చుకున్న సౌత్ స్టార్స్ టాలీవుడ్ ని ద‌శాబ్ధాలుగా ఏలుతున్న అజేయుడైన మెగాస్టార్ చిరంజీవి.( Chiranjeevi ) ఆయన అస‌లు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్.

అసలు పేరు కంటే కొత్త పేరు వెప‌న్ లా ప‌ని చేసింది.క్యాచీగా ఉండే ఒక సాధారణ పేరును ఎంపిక చేయ‌గా ప‌రిశ్ర‌మ‌లో బాగా సహాయపడుతుందనే స‌ల‌హాను చిరు తీసుకున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. కానీ అన్న‌య్య త‌ర‌హాలోనే క్యాచీగా ఉండేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని స్క్రీన్ నేమ్ గా ఉప‌యోగించారు.

అలాగే రజినీకాంత్( RajiniKanth ) అస‌లు పేరు శివాజీ రావు గైక్వాడ్. బ‌స్ కండ‌క్ట‌ర్ గా ప‌ని చేసిన‌ప్ప‌టి పేరు ఇది.తన మరాఠీ పేరు నుంచి మారి రజనీకాంత్ గా తమిళియన్ పేరుకు అప్‌గ్రేడ్ అయ్యారు.అతడు తన పోస్ట్‌ను బస్ కండక్టర్ నుండి సౌత్ ఇండస్ట్రీలో అతిపెద్ద సూపర్ స్టార్‌గా అప్‌గ్రేడ్ చేసిన‌ట్టే ఈ మార్పు స‌హ‌క‌రించింది.

కోలీవుడ్ హీరో ధనుష్( Dhanush ) అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. అతడికి సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ల పేర్లు ఉన్నప్పటికీ పాత పేరును మార్చుకున్నాడు.

ధనుష్ అని పేరు పెట్టుకున్నాడు.

సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు.అలాగే టాలీవుడ్ హీరోయిన్ నయనతార( Nayanthara ) అసలు పేరు డయానా మరియం కురియన్. ఈ పేరు మార్పిడి కేవలం ఎంపిక కాదు.

తన మతాన్ని క్రైస్తవ మతం నుండి హిందూ మతంలోకి మార్చినందున వ‌చ్చిన పేరు.సూర్య శివకుమార్.

అసలు పేరు శరవణన్ శివకుమార్.కెరీర్ ప‌రంగా మ‌రింత‌ విజయవంతం కావడానికి ఈ పేరు సహాయపడుతుందని నమ్మి సూర్యగా( Surya ) మార్చాడు.

సూర్య సౌతిండియాలోనే పెద్ద స్టార్.కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

గ‌జిని- సింగం లాంటి చిత్రాల‌తో టాలీవుడ్ లోను పెద్ద స్టార్ గా అవ‌త‌రించాడు.

చియాన్ విక్రమ్( Chiyan Vikram ) అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్ ఈ స్టార్ అసలు పేరు.సౌత్ ఇండస్ట్రీలో పాపుల‌ర్ స్టార్ల‌లో ఒక‌డిగా ఉన్న విక్ర‌మ్ రాజ‌మౌళి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించాడు.జీవా.

అసలు పేరు అమర్.ఆ తర్వాత సినిమాల కోసం తన పేరును జీవాగా మార్చుకున్నాడు.

రెండు పేర్లకు ఒకే విధమైన అర్థాలు ఉన్నందున అతడు అలా ఎందుకు చేశాడని చాలామంది ఆశ్చర్యపోతారు.సౌంద‌ర్య అస‌లు పేరు వేరు, సౌమ్య స‌త్య‌నారాయ‌ణ‌.

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో సావిత్రి త‌ర్వాత అంత‌టి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న న‌టి.టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా న‌టించిన సౌంద‌ర్య ఎదుగుద‌ల గురించి తెలిసిందే.

అలాగే క్వీన్ సిల్క్ స్మిత అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి.

విజ‌య‌వాడ నుంచి త‌న కీర్తిని గొప్ప శిఖ‌రాల‌కు చేర్చిన మేటి న‌ర్త‌కి సిల్క్.భావనా మీనన్ ఈ బ్యూటీ బ‌ర్త్ నేమ్ కార్తీక మీనన్.అయితే తన పేరును భావనగా మార్చుకోవడం వల్ల తెరపై మరింత శక్తివంతం అవుతుందని నమ్మింది.

ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది.అమితాబ్ ( Amitab Bachchan ) అస‌లు పేరు శ్రీ‌వ‌త్స‌వ‌.

ఇంక్విలాబ్ శ్రీ‌వ‌త్స‌వ అని పేరెంట్ నామ‌క‌ర‌ణం చేసారు.కానీ అమితాబ్ అని పేరు పెట్టుకున్నారు.

బ‌చ్చ‌న్ ఇంటి పేరు.అమితాబ్ బ‌చ్చ‌న్ పేరుకు ఉన్న ప‌వ‌ర్ ఎలాంటిదో తెలిసిందే.

స‌ల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్ధుల్ ర‌షీద్ స‌లీమ్ స‌ల్మాన్ ఖాన్. కానీ సింపుల్ గా స‌ల్మాన్ ఖాన్ అని పిలుస్తారు.

Celebrities real names revealed

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube