ఝాన్సి, సుమల తర్వాత ఒకప్పుడు తెలుగు బుల్లితెరని ఏలిన యాంకర్ ఉదయభాను.అప్పట్లో ఆమె యాంకరింగ్ కు.ఆమె హాట్ లుక్స్ కి చాలామనది ఫ్యాన్స్ ఉన్నారు.పెళ్లి ,పిల్లలు తర్వాత పూర్తిగా ఫేడవుట్ అయినట్టు అనిపించిన ఉదయ భాను ఈమధ్య అసలు పూర్తిగా కనిపించడమే మానేశారు.
అయితే తిరిగి మళ్లీ ఆమె తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది.ఈమధ్యనే బాలకృష్ణ అఖండ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన ఉదయభాను.లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యాం సింగ రాయ్ టీం తో స్పెషల్ చిట్ చాట్ చేశారు.
మళ్లీ ఉదయభాను సినిమా ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ చేయడం పట్ల ఆమెని ఇష్టపడే ఆడియెన్స్ ఖుషి అవుతున్నారు.
తెలుగు బుల్లితెర మీద ఉదయభాను తప్పకుండా తన ముద్ర వేసుకున్నారని చెప్పొచ్చు.సుమ, ఝాన్సిల తర్వాత థర్డ్ ప్లేస్ లో ఉదయభాను ఉన్నారు.
అయితే ఈమధ్య యువ యాంకర్ల ఎంట్రీతో కొద్దిగా వెనకపడ్డది.మళ్లీ ఉదయభాను తిరిగి ఫాం లోకి రావాలని అందరు కోరుతున్నారు.
వరుస షోలు చేస్తున్న ఉదయభాను మళ్లీ మునుపటి హవా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీదట సుమ బిజీగా ఉంటే ఉదయభాను నెక్స్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.