ఈ స్టెప్పులు చూస్తే బన్నీ ఫ్యాన్స్ చెప్పులతో కొడతారు.. కమెడియన్ కు శ్రీముఖి వార్నింగ్?

జబర్దస్త్ షోకు పోటీగా స్టా మా ఛానెల్ లో కామెడీ స్టార్స్ పేరుతో ఒక షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.అయితే జబర్దస్త్ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంలో ఈ షో ఫెయిల్ అవుతుండటం గమనార్హం.

 Star  Anchor Srimukhi  Warning To Comedian Express Hari Details, Anchor Sree Muk-TeluguStop.com

వారంవారానికి ఈ షో రేటింగ్స్ తగ్గుతున్నాయి.కొన్ని నెలల క్రితం వరకు వర్షిణి ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తుండగా ప్రస్తుతం శ్రీముఖి ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా కామెడీ స్టార్స్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోకు శ్రీముఖి వేసిన పంచ్ లు హైలెట్ గా నిలుస్తున్నాయి.తాజాగా రిలీజైన ప్రోమోలో ఎక్స్ ప్రెస్ హరి బన్నీని ఇమిటేట్ చేస్తూ చూపే బంగారమాయలే శ్రీవల్లి పాటకు స్టెప్పులు వేశారు.

అయితే ఎక్స్ ప్రెస్ హరి డ్యాన్స్ చూసిన శ్రీముఖి హరికి వార్నింగ్ ఇచ్చారు.బన్నీ ఫ్యాన్స్ చెప్పులతో కొడతారేమో జాగ్రత్తగా చూసుకో అని శ్రీముఖి ఎక్స్ ప్రెస్ హరికి చెబుతారు.

ఎక్స్ ప్రెస్ హరి ప్రోమోలో నా పేరు బల్లి మా ఆవిడ పేరు శ్రీవల్లి అలా కుదిరేసింది మా ఇద్దరికీ పెళ్లి ఏదినా చేద్దామంటే రాదే పుట్టింటికి వెళ్లి నీకెందుకండి మా లొల్లి అని ఎక్స్ ప్రెస్ హరి చెబుతాడు.

నేను మా పెళ్లానికి చాలా భయపడతానని పెళ్లైన ప్రతి మగాడు పెళ్లానికి భయపడతాడని ఎక్స్ ప్రెస్ హరి కామెంట్లు చేస్తాడు.నా ఫేస్ లో ఏమైనా కనిపిస్తుందా అని అలీ అడగగా భయపడనట్టు కనిపిస్తుందని ఎక్స్ ప్రెస్ హరి చెప్పుకొస్తారు.

ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.శేఖర్ మాస్టర్ కు బదులుగా అలీ ఈ షోకు జడ్జిగా హాజరయ్యారు.

రాబోయే వారాల్లో ఈ షో రేటింగ్ పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube