పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీముఖి.. ఒత్తిడి లేదంటూ..?

ఈ మధ్య కాలంలో పెళ్లి కాని మేల్, ఫిమేల్ యాంకర్లకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.పెళ్లికి సంబంధించి ఇప్పటికే స్పష్టతనిచ్చినా నెటిజన్లు మాత్రం పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో తరచూ యాంకర్లను వేధిస్తున్నారు.

 Star Anchor Srimukhi Shocking Comments About Marriage-TeluguStop.com

స్టార్ యాంకర్ శ్రీముఖి ఉగాది పండుగ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.ఒక నెటిజన్ శ్రీముఖి పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు కూల్ గా శ్రీముఖి తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేదని ఆమె అన్నారు.

 Star Anchor Srimukhi Shocking Comments About Marriage-పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీముఖి.. ఒత్తిడి లేదంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పేరెంట్స్ నుంచి ఎటువంటి ఒత్తిడి లేకపోవడం వల్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు.ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదంటూ నెటిజన్లకు శ్రీముఖి ఉగాది శుభాకాంక్షలు చెప్పారు.

గతంలో ఒక సందర్భంలో పెళ్లి చేసుకునే లోపు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని శ్రీముఖి తెలిపారు.

Telugu Anchor Srimukhi, Crazy Uncles Movie, Marriage, Nithin Maestro Movie, No Marriage Pressure, Shocking Comments, Srimukhi, Srimukhi Marriage, Srimukhi Movie Offers, Ugadi Wishes By Srimukhi-Movie

ప్రస్తుతం శ్రీముఖి పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈవెంట్లతో బిజీగా ఉన్నారు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ ఫోటోలను షేర్ చేయడం ద్వారా శ్రీముఖి ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.త్వరలో శ్రీముఖి హోస్ట్ గా కొత్త షోలు కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి కెరీర్ కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

మరోవైపు శ్రీముఖి చేతిలో సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయి.

శ్రీముఖి కీలక పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ త్వరలో రిలీజ్ కానుండగా నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమాలో కూడా శ్రీముఖి నటిస్తున్నారని సమాచారం.వరుస ఆఫర్లతో శ్రీముఖి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

#Marriage #NoMarriage #UgadiWishes #NithinMaestro #Anchor Srimukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు