అలాంటి అబ్బాయితోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన శ్రీముఖి..?

బుల్లితెర యాంకర్ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.రష్మీ, శ్రీముఖి పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వస్తున్నాయి.

 Star Anchor Srimukhi Clarity About Wedding Rumours,latest  Tollywood,news-TeluguStop.com

బుల్లితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శ్రీముఖి వయస్సు ప్రస్తుతం 27 సంవత్సరాలు.బుల్లితెర షోలతో పాటు ఈవెంట్లతో సైతం శ్రీముఖి బిజీగా ఉండటం గమనార్హం.

త్వరలో శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ మూవీ విడుదల కానుంది.

పెళ్లి గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో శ్రీముఖి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.

ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉండే అబ్బాయిని.ఎక్కువగా గారాబం చేయడంతో పాటు ఫ్రీ స్పేస్ ఇచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని శ్రీముఖి తెలిపారు.31 సంవత్సరాల వయస్సులో శ్రీముఖి పెళ్లి జరగబోతుందని.మరో నాలుగు సంవత్సరాల పాటు శ్రీముఖి సినిమా, టీవీ షోలతో బిజీగా ఉండబోతున్నారని సమాచారం.

Telugu Srimukhi, Anchor, Rumours-Movie

శ్రీముఖి 31 సంవత్సరాల తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 2025 సంవత్సరం తరువాతే శ్రీముఖికి పెళ్లి జరిగే అవకాశం ఉంది.ఒక టాక్ షోలో శ్రీముఖి తన పెళ్లి గురించి ఈ విషయాలను వెల్లడించారని సమాచారం.మరోవైపు శ్రీముఖి బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.కెరీర్ ను శ్రీముఖి పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.పటాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖికి బిగ్ బాస్ షో పాపులారిటీని తెచ్చిపెట్టింది.

బిగ్ బాస్ షో సీజన్ 3 కోసం పటాస్ షోకు దూరమైన శ్రీముఖి ఆ షో రన్నర్ గా నిలిచినా విన్నర్ కంటే ఎక్కువగా ప్రైజ్ మనీని పొందినట్టు తెలుస్తోంది.

గతేడాది శ్రీముఖి కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన సంగతి కూడా తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube