యాంకర్ రవి తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బుల్లితెర యాంకర్ రవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తనదైన శైలిలో యాంకరింగ్ ద్వారా రవి ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో, ఈవెంట్లలో అవకాశాలను సంపాదించుకుంటున్నారు.

 Star Anchor Ravi First Remuneration Details Here-TeluguStop.com

సోషల్ మీడియాలో తాజాగా రవి, నిత్యా సక్సేనా తాజాగా యూట్యూబ్ వీడియోలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.రవి కూతురు వియాతో కలిసి సందడి చేసిన వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.

యాంకర్ రవి తన భార్య గురించి చెబుతూ బీటెక్ థర్డ్ ఇయర్ లోనే నిత్యాకు ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందని ఆమె సంపాదన 22,000 రూపాయలు వెల్లడించారు.2010 సంవత్సరంలో తొలిసారి లైవ్ షో చేసినట్టు రవి చెప్పుకొచ్చారు.ఆ టైమ్ లో ఎపిసోడ్ కు 250 రూపాయల చోపున తీసుకున్నానని అదే తొలి రెమ్యునరేషన్ అని రవి వెల్లడించారు.నెలలో ఎన్ని ఎపిసోడ్లు చేస్తే అన్ని 250 రూపాయలు వచ్చాయని రవి పేర్కొన్నారు.

 Star Anchor Ravi First Remuneration Details Here-యాంకర్ రవి తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2010 ఫిబ్రవరిలో మా మ్యూజిక్ ఛానల్ లో లవ్ జంక్షన్ షో ద్వారా కెరీర్ ను మొదలుపెట్టానని రవి వెల్లడించారు.సంవత్సరం పాటు తాను అదే రెమ్యునరేషన్ కు పని చేశానని ఆ తర్వాత కెరీర్ లో ఎదుగుతూ వచ్చానని రవి వెల్లడించారు. నిత్యా సక్సేనా తనకు కోపం వచ్చిన సమయంలో ఏం ఆశిస్తానని రవిని అడగగా దగ్గరకొచ్చి రవి కూర్చుని మాట్లాడాలని కోరుకుంటానని నిత్యా సక్సేనా పేర్కొన్నారు.

తాను క్రికెటర్ కావాలని అనుకున్నానని కొన్ని కారణాల వల్ల క్రికెటర్ కాలేకపోయానని రవి వెల్లడించారు.ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసనే కాన్సెప్ట్ తో రవి నిత్యా సక్సేనా వీడియో చేశారు.చిన్నప్పుడు తాను డాక్టర్ కావాలని అనుకున్నానని నిత్యా సక్సేనా పేర్కొన్నారు.

రవి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.

#AnchorRavi #AnchorRavi #Ravi #Nitya Saxena #First Salary

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు