యాంకర్ రష్మీకి కరోనా అంటూ ప్రచారం.. నిజమేనా..?

బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఈవెంట్లలోను, ఇతర షోలలోనూ సందడి చేసే రష్మీ వరుసగా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా అంతకంతకూ ఎదగడానికి ప్రయత్నిస్తోంది.

 Star Anchor Rashmi Gautam Tested Corona Positive-TeluguStop.com

అయితే రష్మీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 18వ తేదీన సుడిగాలి సుధీర్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

 Star Anchor Rashmi Gautam Tested Corona Positive-యాంకర్ రష్మీకి కరోనా అంటూ ప్రచారం.. నిజమేనా..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుధీర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయన సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.అయితే తాజాగా రష్మీకి కూడా కరోనా అంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి.

రష్మీ జబర్దస్త్, ఢీ షోలతో పాటు అక్కా ఎవరే అతగాడు అనే ఈవెంట్ లో పాల్గొంది.

రష్మీకి కూడా కరోనా సోకిందన్న వార్త నిజం అయితే కొన్ని వారాల పాటు ఈటీవీలో పలు షోల ప్రసారాలు ఆగిపోయే అవకాశం ఉంది.

అయితే రష్మీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.మరోవైపు జబర్దస్త్ షో షూటింగులు ఆగిపోయాయని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

పలువురు ఆర్టిస్టులు హోం క్వారంటైన్ లో ఉన్నారని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని తెలుస్తోంది.

గతంలో కూడా పలువురు టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి బారిన సెలబ్రిటీలు పడుతుండటం గమనార్హం.రష్మీకి కరోనా అంటూ వైరల్ అవుతున్న వార్త గురించి ఆమె స్పందించి స్పష్టతనిస్తుందేమో చూడాల్సి ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్న రష్మీ కరోనా వార్తల విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

#Jabardasth #Social Media #Rumors #Rashmi Gautam #StarAnchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు