పెళ్లికి సిద్ధమైన స్టార్ యాంకర్ రష్మీ.. అవాక్కైన అభిమానులు..?

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పెళ్లికి సంబంధించిన వార్త కోసం ఆమె అభిమనులు వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.సుడిగాలి సుధీర్ రష్మీ మధ్య నిజంగా ప్రేమ ఉందని కొంతమంది భావిస్తుంటే మరికొందరు మాత్రం టీఆర్పీల కోసమే షోల నిర్వాహకులు రష్మీ సుధీర్ మధ్య ఏదో ఉందని నమ్మించే విధంగా షోలు ప్రసారం చేస్తున్నారని భావిస్తున్నారు.

 Star Anchor Rashmi Bride Getup Photo Goes Viral In Social Media, Anchor Rashmi,-TeluguStop.com

ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ తాజాగా పెళ్లి దుస్తుల్లో ఒక ఫోటోను షేర్ చేశారు.

రష్మీని పెళ్లి దుస్తుల్లో చూసి షాకవ్వడం అభిమానుల వంతవుతోంది.

సినిమాల్లో చిన్నచిన్న పాత్రలతో రష్మీ గౌతమ్ కెరీర్ ను మొదలుపెట్టగా ఆ పాత్రలు రష్మీకి ఆశించిన స్థాయిలో మంచిపేరును తెచ్చిపెట్టలేదు.అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ షో తర్వాత రష్మీ జాతకమే మారిపోయింది.

బుల్లితెరపై ఊహించని స్థాయిలో రష్మీకి పేరు వచ్చింది.అద్భుతమైన హోస్టింగ్ తో తక్కువ సమయంలోనే రష్మీ పేరు మారుమ్రోగింది.

మొదట్లో అనసూయ జబర్దస్త్ షోకు హోస్ట్ గా వ్యవహరించగా అనసూయ ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చారు.అనసూయ మళ్లీ జబర్దస్త్ షోకు రీఎంట్రీ ఇవ్వడంతో మల్లెమాల నిర్వాహకులు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో పేర్లతో రెండు ప్రోగ్రామ్ లను ప్రసారం చేశారు.

సుడిగాలి సుధీర్ రష్మీ ఒకరిపై మరొకరు చేసుకునే కామెంట్ల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.హీరోయిన్ గా కూడా రష్మీ పలు సినిమాల్లో నటించినా గుంటూరు టాకీస్ మాత్రమే హిట్ రిజల్ట్ ను అందుకుంది.

Telugu Anchor Rashmi, Getup, Anchorrashmi-Movie

తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి దుస్తుల్లో రష్మీ గౌతమ్ ఫోటోను షేర్ చేయగా కొంతమంది నెటిజన్లు ఈ ఫోటో జబర్దస్త్ షో కోసం రష్మీ వేసిన స్కిట్ కు సంబంధించిన ఫోటో అని కామెంట్లు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో రష్మీ పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube