యాంకర్ రవి, యాంకర్ లాస్య వేరువేరుగా చేసిన షోల కంటే కలిసి చేసిన షోలే ఎక్కువగా హిట్ అయ్యాయి.సమ్ థింగ్ సమ్ థింగ్ షోతో యాంకర్లుగా కెరీర్ ను మొదలుపెట్టిన రవి, లాస్య ఆ షో ద్వారా సక్సెస్, ఫేమ్ ను సంపాదించుకోవడంతో పాటు ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకున్నారు.
ఢీ షోకు నిహారిక యాంకర్ గా ఉన్న సమయంలో రవి, లాస్య టీం లీడర్లుగా పని చేశారు.అయితే ఆ షో తర్వాత వేర్వేరు కారణాల రవి, లాస్య కలిసి షోలు చేయలేదు.
పెళ్లి తర్వాత టీవీ షోలకు కొన్నేళ్లు దూరంగా ఉన్న లాస్య మళ్లీ రవితో కలిసి షోలు చేయడంతో పాటు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి లాస్య ఒకరి గురించి మరొకరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అయితే ఐదేళ్లు టీవీ షోలకు దూరమైన ఈ జోడీ మళ్లీ కలిసి పని చేయడానికి డైరెక్టర్ సంతోష్ కారణమని చెబుతున్నారు.స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన సంక్రాంతి ఈవెంట్ ద్వారా రవిలాస్య జోడి మళ్లీ కలిశారు.
సంతోష్ మొదట రవిని సంప్రదించగా తాను లాస్యతో కలిసి పని చేయడానికి ఎప్పుడైనా సిద్ధమని మొదట లాస్యను సంప్రదించమని రవి చెప్పగా సంతోష్ లాస్యను ఒప్పించారు.ఆ తరువాత రవి లాస్య కలిసి ఈవెంట్ చేయడం ఆ ఈవెంట్ సక్సెస్ కావడం జరిగింది.
ఇంటర్వ్యూలో యాంకర్ లాస్యను రవి ఏ మూడు వస్తువులు లేకపోతే బ్రతకలేరని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు లాస్య రవి ఫోన్ లేకపోయినా సోషల్ మీడియా లేకపోయినా శానిటైజర్ లేకపోయినా బ్రతకలేడంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.కరోనా వచ్చిన తర్వాత శానిటైజర్ వాడటం సాధరణమే అయినా కరోనా రాకముందు నుంచే రవి శానిటైజర్ వాడేవారని లాస్య చెప్పుకొచ్చారు.