కొన్నేళ్ల క్రితం వరకు యాంకర్ గా, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో యాంకర్ ఝాన్సీ బిజీగా ఉండేవారు.ఈ మధ్య కాలంలో ఝాన్సీకి ఆఫర్లు తగ్గినా ఝాన్సీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు పలు వార్తలపై స్పందించడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే తాజాగా మేకప్ మేన్ చేసిన పని తెలిసి ఝాన్సీ ఎమోషనల్ అయ్యారు.కరోనా వల్ల దేశంలోని ప్రజలంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్ కొత్త కేసులు, వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతూ ఉండటం గమనార్హం.లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల అమలు వల్ల కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా అదుపులో ఉంది.
అయితే కరోనా వల్ల చాలామంది ఉపాధిని కూడా కోల్పోయారు.ఇంటికే పరిమితం కావడం వల్ల ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది తమ వంతు సహాయం చేస్తున్నారు.
ఝాన్సీ కూడా తన వంతు సాయంగా కొంతమందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.తన బృందం ద్వారా ఝాన్సీ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.అయితే ఝాన్సీ మేకప్ మేన్ అయిన రమణ అనే వ్యక్తి అసిస్టెంట్ చేసిన పని తెలిసి ఎమోషనల్ అయ్యారు.

అసిస్టెంట్ కు తాను ఇచ్చిన డబ్బులను కూడా అతను కష్టాల్లో ఉన్నవారి కోసం ఖర్చు చేశాడని ఝాన్సీ పేర్కొన్నారు.
25 మందికి సహాయం చేయమని తాను అసిస్టెంట్ రమణకు డబ్బులు ఇచ్చానని మిగిలిన డబ్బులను అతడినే ఉంచుకోమని చెప్పగా మరో నలుగురికి ఆ డబ్బులతో రమణ సాయం చేశాడని ఝాన్సీ అన్నారు.రమణ, శ్రీను సంస్కారం ఉన్న వ్యక్తులని అలాంటి వాళ్లతో కలిసి పని చేయడం తన అదృష్టమని ఝాన్సీ తెలిపారు.