కొత్త వ్యాపారం మొదలుపెట్టిన అరియానా గ్లోరీ.. సపోర్ట్ కావాలంటూ..?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న అరియానా గ్లోరీ ఒకవైపు సినిమాలలో నటిస్తూ కొన్ని వారాల పాటు కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో స్కిట్లు చేసిన సంగతి తెలిసిందే.కొన్ని వారాల క్రితం ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా అరియానా గ్లోరీ పేరు మారుమ్రోగింది.

 Star Anchor Ariyana Glory New Business Details Here , Ariyana Glory, Details Her-TeluguStop.com

అయితే అరియానా ప్రస్తుతం ప్రేక్షకుల్లో తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.

అరియానా గ్లోరీ అసలు పేరు అర్చన కాగా కొన్ని కారణాల వల్ల ఆమె తన పేరును మార్చుకున్నారు.

ఈమె తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ కు చెందిన వారు.యాంకరింగ్ పై ఇష్టం వున్న అరియానా ఆర్జీవీ ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ కాగా అలా వచ్చిన గుర్తింపు వల్లే బిగ్ బాస్ షోలో ఆఫర్ దక్కింది.

ఒక దశలో అరియానా గ్లోరీ బిగ్ బాస్ షో విన్నర్ గా నిలుస్తారని వార్తలు వచ్చినా ఆమెకు ఎక్కువగా ఓట్లు పోల్ కాకపోవడంతో ఆమె నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.

అయితే బిగ్ బాస్ షో తర్వాత మాత్రం ఊహించని స్థాయిలో అరియానాకు ఆఫర్లు వస్తున్నాయి.

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో సైతం అరియానా గ్లోరీ నటిస్తుండటం గమనార్హం.అరియానా గ్లోరీ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.

బిగ్ బాస్ లోకి బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన అరియానా ప్రస్తుతం ఆర్య ఈవెంట్ ప్లానర్స్ పేరుతో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టే పనిలో పడ్డారు.

Telugu Ariyana Glory, Anchor-Movie

ప్రస్తుతం చాలామంది ఇంట్లో ఏ వేడుక నిర్వహించాలన్నా ఈవెంట్ మేనేజర్లపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.భారీగా లాభాలు వచ్చే ఈ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube