బన్నీ ఇలా మారిపోయాడేంటి.. అనసూయ కామెంట్స్ వైరల్..?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా టీజర్ 7వ తేదీ సాయంత్రం విడుదలై యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ టీజర్ కు 29 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.

 Star Anchor Anasuya Interesting Comments About Bunny, Anasuya , Bunny,  Interest-TeluguStop.com

సెలబ్రిటీల నుంచి కూడా పుష్ప టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ తాజాగా పుష్ప సినిమా టీజర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుకుమార్ గత సినిమా రంగస్థలంలో యాంకర్ అనసూయ రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా తరువాత అనసూయకు సినిమా ఆఫర్లు మరింత పెరిగాయి.

పుష్ప సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజం కాలేదు.చావుకబురు చల్లగా సినిమా ఈవెంట్ లో అనసూయ మాట్లాడుతూ బన్నీ సినిమాలో నటించాలని ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిన్న బన్నీ పుట్టినరోజు కాగా పుట్టినరోజు సందర్భంగా అనసూయ విషెస్ చెబుతూ అల్లు అర్జున్ ఇలా మారిపోయాడేంటి అంటూ కామెంట్లు చేశారు.అల్లు అర్జున్ సినిమాసినిమాకు, ఒక పాత్రకు మరో పాత్రకు ఎంతో వేరియేషన్ చూపిస్తున్నారని అనసూయ పేర్కొన్నారు.బన్నీ పుష్పరాజ్ పాత్రలో అద్భుతంగా నటించాడని ఆమె అన్నారు.పుష్ప మూవీ ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుందని అనసూయ పేర్కొన్నారు.

మరోవైపు అనసూయ చేతిలో తెలుగులో బాగానే సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే అనసూయ నటిగా మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే అనసూయ జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తూ ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనసూయ ఫోటో షూట్ లలో పాల్గొంటూ ఫోటోషూట్ లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube