ఆ హీరోయిన్ కు బద్ధకం అంటున్న కింగ్ నాగార్జున.. ఏం జరిగిందంటే?

Star Actor Nagarjuna Shocking Comments About Actress Shriyasaran

ఇండస్ట్రీలో దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి నటిగా శ్రియ కెరీర్ ను కొనసాగిస్తూ పెళ్లి తర్వాత కూడా భారీ సినిమాలలో ఛాన్స్ లు సంపాదించుకుంటున్నారు.తక్కువ రెమ్యునరేషన్ కు శ్రియ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో దర్శకనిర్మాతలు సైతం తమ సినిమాలలో శ్రియను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Star Actor Nagarjuna Shocking Comments About Actress Shriyasaran-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ కీలక పాత్రలో నటిస్తుండగా శ్రియ పాత్రకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

నాగార్జున హీరోగా తెరకెక్కిన సంతోషం, నేనున్నాను, మనం, బాస్ సినిమాలలో శ్రియ నటించారు.

 Star Actor Nagarjuna Shocking Comments About Actress Shriyasaran-ఆ హీరోయిన్ కు బద్ధకం అంటున్న కింగ్ నాగార్జున.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగ్ శ్రియ కాంబోలో తెరకెక్కిన సినిమాలలో బాస్ మినహా మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.నాగార్జునకు ఒక ఇంటర్వ్యూలో మీ పక్కన నటించిన హీరోయిన్లలో బాగా బద్ధకం ఉన్న హీరోయిన్ ఎవరనే ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు నాగార్జున సమాధానంగా శ్రియ పేరును చెప్పారు.

ఆమె షూటింగ్ కు ఆలస్యంగా రావడంతో చాలాసార్లు క్లాస్ తీసుకున్నానని నాగ్ తెలిపారు.గ్లో ఫేస్ ఉన్న హీరోయిన్ అనుష్క అని, వాగుడుకాయ రమ్యకృష్ణ అని నాగార్జున చెప్పుకొచ్చారు.స్టార్ హీరోయిన్ అనుష్క నాగార్జున కాంబినేషన్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు తెరకెక్కాయి.

సూపర్ సినిమాతో అనుష్కను నాగార్జున టాలీవుడ్ కు పరిచయం చేశారనే సంగతి తెలిసిందే.సూపర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

Telugu Anushaka, Bass, Interesting Facts, Intresting Facts, King Nagarjuna, Lazyness, Nagarjuna, Nanunnanu, Ramya Krishna, Shooting, Shriyasaran, Tollywood-Movie

అయితే నాగార్జున అనుష్క జోడీకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత నాగ్ అనుష్క వరుసగా సినిమాల్లో నటించారు.చాలా ఇంటర్వ్యూలలో అనుష్క నాగార్జున గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.నాగ్ నటించిన పలు సినిమాల్లో అనుష్క గెస్ట్ రోల్స్ లో మెరిశారు.నాగ్ ప్రస్తుతం బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాలలో నటిస్తుండగా కొన్ని నెలల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

#Anushaka #Bass #Shriyasaran #Nagarjuna #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube