ఛాన్స్ లు లేక వాచ్ మెన్ గా మారిన బాలీవుడ్ స్టార్ యాక్టర్

చాలా మంది సినిమా ఇండస్ట్రీలో వెలిగిపోవాలని కలలు కంటూ అడుగులు పెడతారు.అయితే ఇక్కడ అవకాశాలు అందుకోవడం ఓ పెద్ద పోరాటం.

 Star Actor Become A Watchmen-TeluguStop.com

ఆ అవకాశం వచ్చిన తర్వాత దానిని వినియోగించుకొని గుర్తింపు తెచ్చుకోవడం మరో పెద్ద పోరాటం.ఇలా సినిమా ఇండస్ట్రీలో నిత్యం బ్రతుకుతో గుర్తింపు కోసం యుద్ధం చేస్తూనే ఉండాలి.

ఇలా సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలని వచ్చిన చాలా మంది ఒకటి అర అవకాశాలకి పరిమితం అయ్యి తరువాత బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పనిలో చేరిన వారు ఉన్నారు.అలాగే బిక్షాటన మొదలెట్టిన వారు ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ కి చెందిన స్టార్ యాక్టర్ పరిస్థితి ఇప్పుడు అలాగే అయ్యింది.గతంలో అక్షయ్ కుమార్ సినిమాలో కమెడియన్ గా రాణించిన సవి సిద్దు తరువాత చాలా సినిమాలలో నటించాడు.

అయితే ఊహించని విధంగా అతనికి అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్ధికంగా కుటుంబాన్ని లాగడం భారం అయ్యింది.దీంతో తప్పని సరి పరిస్థితిలో సవి సిద్దూ వాచ్ మన్ గా కాలం వెళ్లదీస్తున్నాడు.

ఇప్పుడు సవి సిద్దు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బాలీవుడ్ కు చెందిన పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube